Telugu Global
Telangana

మంత్రి కేటీఆర్ తో ఇన్ క్రెడిబుల్ హస్క్ ప్రతినిధుల భేటీ..

ప్రభుత్వ సహకారంతో కంపెనీ ఏర్పాటు చేసేందుకు ఇన్ క్రెడిబుల్ హస్క్ సంస్థ ప్రతిపాదనలు సిద్ధం చేసి మంత్రి కేటీఆర్ ని కలిసింది.

మంత్రి కేటీఆర్ తో ఇన్ క్రెడిబుల్ హస్క్ ప్రతినిధుల భేటీ..
X

యూకేలో ప్రతిష్టాత్మక ఇన్ క్రెడిబుల్ హస్క్ ఇంటర్నేషనల్ గ్రూప్ 25మిలియన్ డాలర్ల పెట్టుబడితో తెలంగాణలో తమ రీసైక్లింగ్ యూనిట్ ఏర్పాటుకి ప్రతిపాదనలు చేసింది. ఈమేరకు కంపెనీ ప్రతినిధులు మంత్రి కేటీఆర్ తో భేటీ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వంతో కలసి పనిచేయడానికి ఆసక్తి చూపించారు.

ఇన్‌ క్రెడిబుల్ హస్క్ ఇంటర్నేషనల్ సంస్థ యూకే సీఈఓ కీత్ రిడ్జ్‌ వే తోపాటు ఇండియా విభాగం సీఈఓ సీకా చంద్ర శేఖర్.. మంత్రి కేటీఆర్ ని లండన్ లో కలిశారు. ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్ ఏర్పాటుపై చర్చించారు. పొట్టు ఆధారిత ప్యాలెట్ ల ఉత్పత్తి, ప్లాస్టిక్ రీసైక్లింగ్ కోసం తెలంగాణలో యూనిట్ ఏర్పాటు చేస్తామన్నారు. ఏడాదికి వెయ్యి మిలియన్ టన్నుల బయో ప్యాలెట్ల ఉత్పత్తికి ఈ కంపెనీ ప్రయత్నాలు చేస్తోంది.


తెలంగాణ నుంచి పొట్టు, రీయూజబుల్ ప్లాస్టిక్ ని సేకరించి రీసైక్లింగ్ యూనిట్ లో ఉపయోగిస్తారు. ఈ ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేసేందుకు ఇన్ క్రెడిబుల్ హస్క్ సంస్థ ప్రతిపాదనలు సిద్ధం చేసి మంత్రి కేటీఆర్ ని కలిసింది. ఈ సందర్భంగా.. సదరు సంస్థ ఏర్పాటు చేయాలనుకుంటున్న యూనిట్ కు తెలంగాణ ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో మద్దతు ఉంటుందని తెలిపారు మంత్రి కేటీఆర్.

ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్, ఇన్ క్రెడిబుల్ హస్క్ సంస్థ ప్రతినిధులతోపాటు.. తెలంగాణ పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, పెట్టుబడులు, ప్రచారం, ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాల ప్రత్యేక కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి.. తదితరులు పాల్గొన్నారు.

First Published:  15 May 2023 11:01 AM IST
Next Story