Telugu Global
Telangana

దివ్యాంగుల పింఛన్ భారీగా పెంపు..

దివ్యాంగుల పింఛన్ ను పెంచుతూ ఉత్వర్వులు వెలువడిన సందర్భంగా.. సీఎం కేసీఆర్ ని కలసి పుష్పగుచ్ఛం అందిస్తూ ధన్యవాదాలు తెలిపారు మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్.

దివ్యాంగుల పింఛన్ భారీగా పెంపు..
X

తెలంగాణలో దివ్యాంగులకు శుభవార్త ఇది. పింఛన్ ని భారీగా పెంచింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటి వరకూ 5లక్షలమందికి పైగా దివ్యాంగులు నెల నెలా 3,016 రూపాయల పింఛన్ అందుకుంటున్నారు. వచ్చే నెలనుంచి 4,016 రూపాయల పింఛన్ వారికి అందుతుంది. మంచిర్యాల సభలో దివ్యాంగుల పింఛన్ పెంచుతానని మాటిచ్చిన సీఎం కేసీఆర్ ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకున్నారు. దివ్యాంగుల పింఛన్ పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఏపీలో ఇలా..

ఏపీలో దివ్యాంగుల పింఛన్ లో కేటగిరీలున్నాయి. 100 శాతం దివ్యాంగులకు 5వేల రూపాయలు సామాజిక పింఛన్ అందిస్తున్నారు. సాధారణ కేటగిరీలో కేవలం 3వేల రూపాయలు మాత్రమే పింఛన్ ఇస్తున్నారు. 5వేల రూపాయలు అందుకునేవారి సంఖ్య నామమాత్రంగానే ఉంది. దీంతో తమకు కూడా పింఛన్ పెంచాలని మిగతా లబ్ధిదారులు చాలాకాలంగా డిమాండ్ చేస్తూనే ఉన్నారు. తెలంగాణలో మాత్రం వైకల్యం శాతంతో సంబంధం లేకుండా దాదాపు 5లక్షలమందికి పింఛన్ ని 4,016 రూపాయలకు పెంచుతూ ఉత్తర్వులిచ్చింది ప్రభుత్వం.


సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు..

దివ్యాంగుల పింఛన్ ను పెంచుతూ ఉత్వర్వులు వెలువడిన సందర్భంగా.. సీఎం కేసీఆర్ ని కలసి పుష్పగుచ్ఛం అందిస్తూ ధన్యవాదాలు తెలిపారు మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్. దేశంలో మునుపెన్నడూ లేని విధంగా తెలంగాణలో దివ్యాంగుల పట్ల ప్రభుత్వం ఉదారంగా వ్యవహరిస్తోందన్నారు. వారికి అండగా నిలబడుతూ ఆర్థిక భరోసా కలిగిస్తోందని చెప్పారు.

First Published:  22 July 2023 9:04 PM IST
Next Story