బీసీ రిజర్వేషన్ల పెంపు సాధ్యమే
జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య
ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచడం సాధ్యమేనని జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య అన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు సహా బీసీలకు సంబంధించిన సమస్యలపై బీఆర్‌ఎస్ నాయకులు సోమవారం జస్టిస్ ఈశ్వరయ్యతో భేటీ అయ్యారు. సమగ్ర కులగణన, రిజర్వేషన్ల పెంపునకు చట్టపరంగా ఉన్న సమస్యలపై బీఆర్‌ఎస్ నాయకుల సందేహాలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. ఈశ్వరయ్యను కలిసిన వారిలో శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, ఎల్. రమణ, మాజీ ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, గంగాధర్ గౌడ్, బీఆర్‌ఎస్ నాయకులు చెరుకు సుధాకర్, పల్లె రవికుమార్ గౌడ్, డాక్టర్ ఆంజనేయ గౌడ్, చిరుమిల్ల రాకేశ్, నాగేందర్ గౌడ్, దూదిమెట్ల బాలరాజు, బూడిద భిక్షమయ్య గౌడ్, నోముల భగత్, కిశోర్ గౌడ్, ఉపేందర్, శుభప్రద్ పటేల్, హరి, కుమార్, రాజు తదితరులు ఉన్నారు.