11వ రౌండ్ లోనూ టీఆరెస్ దే ఆధిక్యత
మునుగోడులో 11వ రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. ఈ రౌండ్ లో కూడా టీఆరెస్ మెజార్టీ సాధించింది. దాంతో టీఆరెస్ బీజెపి పై ఇప్పటి వరకు 5794 ఓట్ల ఆధిక్యత సాధించింది.
మునుగోడు ఓట్ల లెక్కింపులో టీఆరెస్ గెలుపువైపు దూసుకపోతోంది. దాదాపు టీఆరెస్ విజయం ఖాయమయ్యింది. బీజేపీ ఆశలు పెట్టుకున్న చండూరు మండలం ఓటర్లు కూడా రాజగోపాల్ రెడ్డికి నిరాశే మిగిల్చారు. 11వ రౌండ్ లో లెక్కించిన చండూరు మండలం ఓట్లలో టీఆరెస్ కు 5794 ఓట్ల ఆధిక్యత లభించింది. బీజేపీ ఆశలు పెట్టుకున్న చౌటుప్పల్ అర్బన్, చండూరు లు కూడా టీఆరెస్ కు జై కొట్టడంతో బీజేపీ ఆశలపి నీళ్ళు చల్లినట్టే అయ్యింది. ఇక మిగిలిన మర్రి గూడెం, నాంపల్లి మండలాల ఓటర్లు ఎలాంటి తీర్పు ఇచ్చారన్నది కొద్ది సేపట్లొ వెల్లడి కానుంది.
ఇక ఇప్పటి వరకు పోలైన ఓట్లలో టీఆరెస్ కు 74,594 ఓట్లు రాగా బీజేపీకి 68,800 ఓట్లు పోలయ్యాయి.
కాగా బీజేపీ అభ్యర్థి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ సర్కార్ నుండి 18000 కోట్ల కాంట్రాక్ట్ తీసుకొని బీజేపీలో చేరి ఈ ఎన్నికలు తెచ్చారన్న టీఆరెస్ ప్రచారం ప్రతి గ్రామంలో కింది స్థాయి వరకు వెళ్ళడం బీజేపీకి తీవ్ర నష్టం కలిగించిందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అంతే కాదు వామపక్షాల పొత్తు కూడా టీఆరెస్ కు బాగా కలిసి వచ్చిందనే వాదనలు కూడా వినవస్తున్నాయి.