Telugu Global
Telangana

కాంగ్రెస్‌ను విమర్శిస్తే బీజేపీకి ఎందుకు ఉలికిపాటు..?

బీజేపీ నేతల ప్రవర్తన కూడా ఈ ఆరోపణలకు బలం చేకూర్చేలానే ఉంది. ఇటీవల బండి సంజయ్ బహిరంగంగానే కాంగ్రెస్‌, బీజేపీ పరస్పరం విమర్శలు చేసుకోవద్దని కామెంట్ చేశారు.

కాంగ్రెస్‌ను విమర్శిస్తే బీజేపీకి ఎందుకు ఉలికిపాటు..?
X

తెలంగాణ రాజకీయాల్లో వింత పరిస్థితి కనపడుతోంది. జాతీయ స్థాయిలో ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న బీజేపీ, కాంగ్రెస్‌ తెలంగాణలో మాత్రం మిత్రులుగా వ్యవహరిస్తున్నాయన్న మాట వినిపిస్తోంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను వదిలి.. బీజేపీ బీఆర్ఎస్‌ను విమర్శించడమే కాదు.. కాంగ్రెస్‌ను బీఆర్ఎస్‌ విమర్శించినా తట్టుకోవట్లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు ఇవే ఆరోపణలు చేస్తున్నారు.

ఇటీవల ఓ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి కేసీఆర్‌ను ఉద్దేశించి మాట్లాడిన మాటలను తప్పుపడుతూ కేటీఆర్‌.. కనకపు సింహసనమున అనే సుమతీ శతకాన్ని వినిపించారు. అయితే ఈ విషయంలో కాంగ్రెస్‌ నుంచి పెద్దగా కౌంటర్‌ రాకున్న బీజేపీ మాత్రం బీఆర్ఎస్ టార్గెట్‌గా విమర్శలు చేస్తోంది. ఇదే విషయంపై బీఆర్ఎస్ స్పందించింది. కాంగ్రెస్‌ను విమర్శిస్తే బీజేపీ ఉలిక్కిపడుతోందని.. బీజేపీ-కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలకు ఇంతకంటే పెద్ద సాక్ష్యం ఉండదని తన అధికారిక ట్విట్టర్‌లో పేర్కొంది. రెండు జాతీయ పార్టీలు ఒక్కటై తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను తుంగలో తొక్కుతున్నాయని ఆరోపించింది.


ఇక బీజేపీ నేతల ప్రవర్తన కూడా ఈ ఆరోపణలకు బలం చేకూర్చేలానే ఉంది. ఇటీవల బండి సంజయ్ బహిరంగంగానే కాంగ్రెస్‌, బీజేపీ పరస్పరం విమర్శలు చేసుకోవద్దని కామెంట్ చేశారు. నల్గొండ లాంటి మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌కు బీజేపీ కౌన్సిలర్లు మద్దతు ఇవ్వడం కూడా చర్చనీయాంశమైంది. గతంలో కేసీఆర్ పేరు వినిపిస్తే విరుచుకుపడే బండి సంజయ్‌.. ఇటీవల అయోధ్యలో బాలక్‌ రామ్ ప్రతిష్టాపన సందర్భంగా రాష్ట్రంలో సెలవు ఇవ్వనప్పటికీ ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు చేయలేదు. ఇక రాజేంద్రనగర్‌లో అగ్రివర్సిటీ భూములను హైకోర్టు నిర్మాణానికి కేటాయిస్తే బీజేపీ అనుబంధ విభాగం ABVP పెద్దఎత్తున నిరసన తెలిపింది. ఈ సందర్భంగా ఓ ABVP మహిళ కార్యకర్తను పోలీసులు జుట్టు పట్టి ఈడ్చుకెళ్లిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపైనా బీజేపీ నుంచి పెద్దగా రెస్పాన్స్‌ రాలేదు.

కాంగ్రెస్‌, బీజేపీ ములాఖత్ అయ్యాయని బీఆర్ఎస్ ఎప్పటినుంచో ఆరోపణలు చేస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ నిజామాబాద్, కరీంనగర్ లాంటి పార్లమెంట్ స్థానాల్లో రెండు జాతీయ పార్టీలు సహకరించుకున్నాయని చాలా సార్లు ఆరోపించింది.

First Published:  28 Jan 2024 12:28 PM IST
Next Story