గ్రూప్-1 పరీక్షలపై నేడు కీలక ప్రకటన
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్ధుల ఆందోళతోప్రతిపక్షా బీఆర్‌ఎస్ పార్టీ సైతం మద్దతు పలుకుతున్న నేపథ్యంలో రేవంత్ సర్కార్ అప్రమత్తమైంది.
గ్రూప్-1 అభ్యర్ధుల డిమాండ్లపై నేడు తెలంగాణ మంత్రులు కీలక ప్రకటన చేయనున్నారు. నిన్న మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంట్లో మంత్రులు దామోదర్ రాజనర్సింహ, శ్రీధర్‌బాబు, కొండా సురేఖ శనివారం రాత్రి ఉన్నతాధికారులతో చర్చించారు. గ్రూప్-1 పరీక్షను అసలు వాయిదా వేయడం సాధ్యమా అనే కోణంలో అర్ధరాత్రి వరకు సుదీర్ఘంగా మూడు గంటలపాటు మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు ఉన్నతాధికారులతో చర్చించారు. జీవో 29పై వస్తున్న విమర్శలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
పరీక్షల వాయిదా సాధ్యాసాధ్యాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. నిరుద్యోగులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు .గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని, జీవో 29ని క్యాన్సిల్ చేయాలని అభ్యర్థులు ఆందోళనకు దిగడం.. వారికి ప్రతిపక్షాలు సైతం మద్దతు పలుకుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. దీనిపై ఆదివారం కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ నెల 21వ తేదీ నుంచి మెయిన్స్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.