Telugu Global
Telangana

ఓర్వలేనితనంతోనే ప్రభుత్వానికి ప్రతిపక్షాల అడ్డంకులు

విపక్షాలు సలహాలు, సూచనలు ఇస్తే స్వీకరించడానికి తామెప్పుడూ సిద్ధంగానే ఉన్నట్టు మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడి

ఓర్వలేనితనంతోనే ప్రభుత్వానికి ప్రతిపక్షాల అడ్డంకులు
X

ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ ప్రతిపక్షాలు ఓర్వలేని తనంతో అనేక అడ్డంకులు సృష్టిస్తున్నదని మంత్రి శ్రీధర్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తున్నామన్నారు. ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో కలిసి మంత్రి మీడియాతో మాట్లాడుతూ... గత ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ లేకుండా ఆర్థిక వ్యవస్థను నడిపింది. మేము రైతులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూనే సన్నరకాల వడ్లకు రూ. 500 బోనస్‌ ఇస్తూనే... మద్దతు ధరతో ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామన్నారు. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి ధాన్యం కొనుగోలు అంశాన్ని ముందుపెట్టి మమ్మల్ని బద్నాం చేయడానలి విపక్షాలు చూశాయని వాళ్ల పప్పులేమీ ఉడకలేదనన్నారు. అలాగే ధర్మపురి అభివృద్ధికి కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. స్థానిక ఎమ్మెల్మే ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేశారన్నారు. విపక్షాలు సలహాలు, సూచనలు ఇస్తే స్వీకరించడానికి తామెప్పుడూ సిద్ధంగానే ఉన్నట్టు మంత్రి తెలిపారు.

First Published:  22 Nov 2024 12:30 PM IST
Next Story