Telugu Global
Telangana

భారతీయుల రోగనిరోధక శక్తి పెరిగింది, కోవిడ్ తో ప్రమాదం లేదు.... హైదరాబాద్ ఐఐటీ పరిశోధకులు

ప్రస్తుతం పెరుగుతున్న కరోనా కేసులు రాబోయే కొద్ది రోజుల్లో ఆగిపోతాయని ఐఐటి-కాన్పూర్ ప్రొఫెసర్ మనీంద్ర అగర్వాల్, ఐఐటి-హైదరాబాద్‌లోని సెర్బ్ నేషనల్ సైన్స్ చైర్ పర్సన్ డాక్టర్ ఎం విద్యాసాగర్‌తో సహా పలువురు పరిశోధకులు తమ అధ్యయనం లో తేల్చారు.

భారతీయుల రోగనిరోధక శక్తి పెరిగింది, కోవిడ్ తో ప్రమాదం లేదు.... హైదరాబాద్ ఐఐటీ పరిశోధకులు
X

అనేక భారతీయ నగరాల్లో XBB 1.16 వేరియంట్ కారణంగా ప్రస్తుత కోవిడ్ ఇన్ఫెక్షన్ల పెరుగుదల ప్రమాదకరం కాదని, గత మూడు కరోనా వేవ్ ల వల్ల భారతీయుల్లో సహజ రోగనిరోధక శక్తి బలంగా తయారయ్యిందని హైదరాబాద్, కాన్పూర్‌కు చెందిన IIT పరిశోధకులు ఆదివారం తెలిపారు.

ప్రస్తుతం పెరుగుతున్న కరోనా కేసులు రాబోయే కొద్ది రోజుల్లో ఆగిపోతాయని ఐఐటి-కాన్పూర్ ప్రొఫెసర్ మనీంద్ర అగర్వాల్, ఐఐటి-హైదరాబాద్‌లోని సెర్బ్ నేషనల్ సైన్స్ చైర్ పర్సన్ డాక్టర్ ఎం విద్యాసాగర్‌తో సహా పలువురు పరిశోధకులు తమ అధ్యయనం లో తేల్చారు.

XBB 1.16 వేరియంట్ కారణంగా ఇన్ఫెక్షన్‌లు కొద్ది మేర పెరుగుతున్నాయని వ్యాఖ్యానిస్తూ, “మాపరిశోధన‌ ప్రకారం, 9నుండి12 శాతం మంది మాత్రమే తమ సహజ రోగనిరోధక శక్తిని కోల్పోయారు. అందుకే ఈ వ్యాధి పెద్దగా విస్తరించడం లేదు ”అని అగర్వాల్ చెప్పారు.

తమ పరిశోధన‌ ఆధారంగా, IIT పరిశోధకులు రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా రోజుకు 16,000 కరోనా పాజిటివ్ కేసులకు చేరుకోవచ్చని అంచనా వేశారు. రానున్న రోజుల్లో కరోనా పూర్తిగా తగ్గుముఖం పడతుంద‌ని వారు తెలిపారు. .

XBB 1.16 వేరియంట్‌ను ట్రాక్ చేయడంలో పాల్గొన్న నిపుణులైన ఎపిడెమియాలజిస్టులు, ప్రజారోగ్య పరిశోధకులు కూడా ప్రస్తుత ఆల్-ఇండియా డేటా భారతీయ కోవిడ్ వేవ్ ముగిసిందని, అది ఇప్పుడు మందగించిన‌ట్లు స్పష్టమైన సంకేతాలు ఉన్నాయని అంటున్నారు.

First Published:  24 April 2023 7:30 AM GMT
Next Story