ఈ వేసవిలో తెలంగాణలో వేడి గాలులు తక్కువగా ఉండే అవకాశం -IMD ప్రకటన
Heat Wave in Telangana: మార్చి, ఏప్రిల్, మే నెలల్లో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం నుంచి సాధారణ స్థాయి కంటే తక్కువగా ఉంటాయని, ఈ ఏడాది హీట్ వేవ్ పరిస్థితులు తక్కువగా ఉండే అవకాశం ఉందని IMD-Hలోని సైంటిస్ట్- డాక్టర్ ఎ. శ్రావణి చెప్పారు.
ఈ వేసవిలో ఉత్తరభారత దేశంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడంతో పాటు వడగాల్పులు ఎక్కువగా ఉండే అవకాశం ఉండగా తెలంగాణలో మాత్రం ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలోనే ఉంటాయని, వడగాల్పులు కూడా ఉండే అవకాశం తక్కువని భారత వాతావరణ విభాగం - హైదరాబాద్ (IMD-H) ప్రకటించింది.
మార్చి, ఏప్రిల్, మే నెలల్లో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం నుంచి సాధారణ స్థాయి కంటే తక్కువగా ఉంటాయని, ఈ ఏడాది హీట్ వేవ్ పరిస్థితులు తక్కువగా ఉండే అవకాశం ఉందని IMD-Hలోని సైంటిస్ట్- డాక్టర్ ఎ. శ్రావణి చెప్పారు.మార్చిలో సాధారణం నుండి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం ఉండే అవకాశం ఉందని అంచనా వేశారు.
రాష్ట్రంలో ఫిబ్రవరిలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంగానే ఉన్నాయని డాక్టర్ శ్రావణి చెప్పారు. అయితే కొన్ని జిల్లాల్లో 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కానీ అవి స్థిరంగా లేవు. హైదరాబాద్‌లో, ఐదుసార్లు 35 డిగ్రీల సెల్సియస్ కన్నా పైకి వెళ్ళాయి. దాదాపు రెండుసార్లు 36 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకున్నాయి.
వాయువ్య భారతదేశం, మధ్య, పశ్చిమ భారతదేశం ఫిబ్రవరిలో విపరీతమైనఉష్ణోగ్రతలను చవిచూసిందని డాక్టర్ శ్రావణి చెప్పారు.
ఇదిలా ఉండగా రాబోయే ఏడు రోజుల్లో హైదరాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రతలు 36 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోవచ్చని, కనిష్ట ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉండవచ్చని IMD-H తెలిపింది.