Telugu Global
Telangana

బల్దియా కమిషనర్‌గా ఇలంబర్తి

ఏపీకి బదిలీ అయిన ఐఏఎస్‌ అధికారుల స్థానాల్లో ఇన్ ఛార్జ్‌లను తెలంగాణ ప్రభుత్వం నియమించింది.

బల్దియా కమిషనర్‌గా ఇలంబర్తి
X

ఏపీకి బదిలీ అయిన ఐఏఎస్‌ అధికారుల స్థానాల్లో ఇన్ ఛార్జ్‌లను తెలంగాణ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి నియమించింది. ఈ క్రమంలో పర్యాటక శాఖ ముఖ్యకార్యదర్శిగా ఎన్. శ్రీధర్‌కు అప్పగించారు. విద్యుత్‌శాఖ ముఖ్య కార్యదర్శిగా సందీప్ కుమార్ సుల్తానియా, మహిళా సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శిగా టి. కె శ్రీదేవి, జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఇలంబర్తిలకు, ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ సీఈవోగా ఆర్‌వీ కర్ణన్‌, ఆయుష్‌ డైరెక్టర్‌గా క్రిస్ట్రినాకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన ఐఏఎస్‌లకు క్యాట్‌ ఇచ్చిన తీర్పుపై హైకోర్టును ఆశ్రయించగా అక్కడ కూడా భంగపాటు తప్పలేదు. తెలంగాణ హైకోర్టు కూడా వెంటనే ఆంధ్రప్రదేశ్‌లో రిపోర్ట్‌ చేయాలని ఆదేశించింది. ఇలాంటి విషయాల్లో తాము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది.

First Published:  16 Oct 2024 8:41 PM IST
Next Story