Telugu Global
Telangana

పత్తి అమ్మకాల్లో సమస్యలుంటే వాట్సప్‌ లో కంప్లైంట్‌ చేయండి

రైతులకు సూచించిన మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావు

పత్తి అమ్మకాల్లో సమస్యలుంటే వాట్సప్‌ లో కంప్లైంట్‌ చేయండి
X

రైతులకు పత్తి అమ్మకాల్లో ఏ సమస్య ఎదురైనా వాట్సప్‌ ద్వారా కంప్లైంట్‌ చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావు సూచించారు. గురువారం సెక్రటేరియట్‌ లో పత్తి కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించారు. సీసీఐ ఎంత పత్తిని కొనుగోలు చేసింది.. ఎంత రిజెక్ట్‌ చేసిందనే వివరాలు తెలియజేయడానికి ప్రత్యేక వెబ్‌ పోర్టల్‌ అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. మార్కెటింగ్‌ అధికారులు ఎప్పటికప్పుడు జిన్నింగ్‌ మిల్లుల్లో తనిఖీలు చేసి నివేదికలు అందజేయాలన్నారు. రైతులు 8 నుంచి 12 శాతం తేమ ఉన్న పత్తిని మార్కెట్‌ కు తీసుకువచ్చి మద్దతు ధర పొందాలన్నారు. పత్తి అమ్ముకోవడంలో ఎలాంటి సమస్య ఎదురైనా వాట్సప్‌ చాట్‌ నం. 8897281111 ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు.

First Published:  7 Nov 2024 5:56 PM IST
Next Story