Telugu Global
Telangana

పత్తి, మిర్చి స్థానంలో పామాయిల్‌ సాగు చేస్తే లాభం

రైతులు సంప్రదాయ పంటల నుంచి ఉద్యాన పంటల వైపు మళ్లాలని మంత్రి తుమ్మల సూచన

పత్తి, మిర్చి స్థానంలో పామాయిల్‌ సాగు చేస్తే లాభం
X

పత్తి, మిర్చి స్థానంలో పామాయిల్‌ సాగు చేస్తే అధిక లాభమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు తెలిపారు. ఖమ్మం జిల్లా గుర్రాలపాడు పత్తి కొనుగోలును మంత్రి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 40 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఈసారి పత్తి దిగుబడి తగ్గిందన్నారు. ఖమ్మం జిల్లాలో 17 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నామన్నారు. జిల్లాలో సీసీఐ కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. రైతులకు ఇబ్బంది లేకుండా రెవెన్యూ, మార్కెట్‌ అధికారులే చూడాలన్నారు. పత్తి రైతులను మోసం చేస్తే ప్రైవేట్‌ వ్యాపారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులు సంప్రదాయ పంటల నుంచి ఉద్యాన పంటల వైపు మళ్లాలని మంత్రి సూచించారు. పత్తి, మిర్చి స్థానంలో పామాయిల్‌ సాగు చేస్తే అధిక లాభాలుంటాయన్నారు. పంటలకు గిట్టు బాటు ధర అందించాలన్నదే మా ప్రభుత్వ సంకల్పం అన్నారు.

నాణ్యమైన పత్తి తీసుకొచ్చి గరిష్టమైన ధర పొందాలి: మంత్రి కొండా

వరంగల్‌ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌ కేంద్రంలో మంత్రి కొండా సురేఖ పత్తి కొనుగోళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆసియాలో ఇది అతిపెద్ద రెండో మార్కెట్‌ అన్నారు. కష్టపడి పండించిన రైతు ఎక్కడా కూడా నష్టపోకూడదన్నారు. రైతు సంతోషంగా ఉంటేనే రాజ్యం సంతోషంగా ఉంటుందని మా పార్టీ నమ్ముతుందన్నారు. రైతుల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ముందుకెళ్లే బాధ్యత కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. మార్కెట్‌కు వచ్చిన ప్రతి పత్తి బస్తా కొనుగోలు చేస్తామని మంత్రి తెలిపారు. తేమ శాతాన్ని దృష్టిలో పెట్టుకుని తేమ శాతాన్ని పరిశీలించడానికి ఒక కమిటీ వేశామని కలెక్టర్‌ చెప్పారు. రైతులు నాణ్యమైన పత్తి తీసుకొచ్చి గరిష్టమైన ధర పొందాలని సూచించారు.

First Published:  21 Oct 2024 5:59 AM GMT
Next Story