నన్ను అరెస్టు చేస్తే ప్రజలవద్దకు వెళ్తా -కల్వకుంట్ల కవిత
ఈ నెల 10వ తేదీన మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా ఉండటం వల్ల రేపు ఈడీ ముందు హాజరు విషయంలో న్యాయ సలహా తీసుకుంటానని ఆమె చెప్పారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈ నెల 9న తమ ముందు హాజరుకావాల్సిందిగా తెలంగాణ ఎమ్మెల్యే కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడంపై ఆమె స్పందించారు. దర్యాప్తు సంస్థకు తాను పూర్తి స్థాయిలో సహకరిస్తానని తెలిపారు.
అయితే ఈ నెల 10వ తేదీన మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా ఉండటం వల్ల రేపు ఈడీ ముందు హాజరు విషయంలో న్యాయ సలహా తీసుకుంటానని ఆమె చెప్పారు.
తాను ఏ తప్పు చేయలేదని, ఒక వేళ ఈడీ తనను అరెస్టు చేస్తే న్యాయం కోసం ప్రజలవద్దకు వెళ్తానని ఆమె అన్నారు.
10వ తేదీ తర్వాత ఏ రోజైనా తాను హాజరవడానికి సిద్దమని కవిత ఈడీకి లేఖ రాస్తున్నట్టు సమాచారం. మరి ఈడీ కవిత విజ్ఞప్తిని అంగీకరిస్తుందా లేదా అనేది చూడాల్సి ఉంది.
కాగా, కేంద్ర బీజేపీ సర్కార్ ప్రజా వ్యతిరేక చర్యలపై పోరాడుతున్నందుకే బీఆరెస్ పై బీజేపీ కక్షసాధింపులకు పాల్పడుతోందని మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు మండి పడ్డారు. కవితకు ఈడీ నోటీసులువ్వడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని ఆయన అన్నారు.మంత్రులు జగదీశ్వర్ రెడ్డి, సత్యవతి రాథోడ్ తదితరులు కూడా కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడాన్ని ఖండించారు.