Telugu Global
Telangana

రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు

ధాన్యం కొనుగోళ్లలో నిబంధనలు ఉల్లంఘించే వ్యాపారులపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించిన సీఎం

రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు
X

ధాన్యం కొనుగోళ్లలో రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించే వ్యాపారులపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. వారిపై ఎస్మా కింద చర్యలు తీసుకోవాలన్నారు. పంటల కొనుగోళ్లలో మోసాలకు పాల్పడకుండా చూడాలన్నారు. రైతులను వేధిస్తే ఊరుకునేది లేదని చెప్పారు. ధాన్యం కొనుగోళ్లు సాఫీగా జరిగేలా కలెక్టర్లు చూడాలన్నారు. ఇబ్బందులుంటే ఉన్నతాధికారులతో మాట్లాడి పరిష్కరించాలని సీఎం సూచించారు.

ధాన్యం కొనుగోలు చేయాలంటూ నిన్న నల్గొండలో రైతులు రోడ్డెక్కారు. మిల్లర్లు సిండికేట్‌గా ఏర్పడి ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ.. నార్కట్‌పల్లి-అద్దంకి నేషనల్‌ హైవేపై ధర్నా చేపట్టారు. ఆరుగాలం శ్రమించి తెచ్చిన పంటను మిల్లులకు తెస్తే మద్దతు ధర ఇవ్వకపోగా.. తాలు, తేమ పేరుతో నానా కొర్రీలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బోనస్‌ సంగతి దేవుడెరుగు.. ఐకేపీ కేంద్రాలలలో సన్నాలను కొనేవారే లేరని విమర్శించారు. తిండి తిప్పలు లేకుండా రెండు రోజులుగా తిరగని మిల్లు లేదు. ప్రభుత్వం మద్దతు ధర ఇస్తామన్నది. కానీ ఆ మద్దతు ఇవ్వడం లేదన్నారు.. మిల్లుల దగ్గరి వస్తే 2000-2200 అంటున్నారు. మిల్లర్లు చెప్పే ధరకు వడ్లు అమ్మితే రైతులు అప్పులు పాలవడం ఖాయమన్నారు. మిల్లర్లు, ప్రభుత్వం కుమ్మక్కై రైతులను గోస పెడుతున్నారని మండిపడ్డారు. ఆరు నెలలు కష్టపడి పంట పండిస్తే రోడ్డుపై కూర్చునే దుస్థితికి తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సీఎం ధాన్యం కొనగోళ్లలపై స్పందించారు.

First Published:  11 Nov 2024 10:39 AM IST
Next Story