Telugu Global
Telangana

అవినీతి నిజమైతే విచారణ ఎందుకు చేస్తలేరు

ఆన్‌లైన్‌ పద్ధతిలో దివ్యాంగుల ఉపకరాలు కొనుగోలు చేశాం : బీఆర్‌ఎస్‌ నేత వాసుదేవ రెడ్డి

అవినీతి నిజమైతే విచారణ ఎందుకు చేస్తలేరు
X

దివ్యాంగుల ఉపకరణాల కొనుగోలులో అక్రమాలు నిజమే అయితే విచారణ ఎందుకు చేయడం లేదని దివ్యాంగుల కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌, బీఆర్‌ఎస్‌ నేత వాసుదేవ రెడ్డి ప్రశ్నించారు. బుధవారం తెలంగాణ భవన్‌ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయలేకనే తమపై పడి ఏడుస్తున్నారని మండిపడ్డారు. దివ్యాంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ వీరయ్య మాజీ మంత్రులు హరీశ్‌ రావు, కొప్పుల ఈశ్వర్‌ పై చేసినవన్నీ తప్పుడు ఆరోపణలేనన్నారు. ప్రస్తుత మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో దివ్యాంగుల శాఖ మంత్రిగా పని చేశారని, అంటే అవినీతిలో ఆయనకు భాగం ఉందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ అంటే స్కాం అని.. బీఆర్‌ఎస్‌ అంటే స్కీంలని తెలిపారు. దివ్యాంగులకు రూ.6 వేల పింఛన్‌ ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పాలన్నారు. ఉచిత బస్సు ప్రయాణం హామీ ఎప్పటి నుంచి అమలు చేస్తారని ప్రశ్నించారు. దివ్యాంగులకు బీఆర్‌ఎస్‌ నాయకులు తమ సొంత నిధులతో టూ వీలర్లు, త్రీ వీలర్లు కొనుగోలు చేసి ఇచ్చారని తెలిపారు. ప్రస్తుత చైర్మన్‌ కు దివ్యాంగులకు సంబంధించిన సమస్యలపై అసలు అవగాహన లేదన్నారు. పదేళ్లలో దివ్యాంగుల కార్పొరేషన్‌ కు కేటాయించిందే రూ.63 కోట్లు అని.. అలాంటప్పుడు రూ.వంద కోట్ల అవినీతి ఎలా జరుగుతుందో చెప్పాలన్నారు.

First Published:  9 Oct 2024 6:43 PM IST
Next Story