Telugu Global
Telangana

ఆగర్భ శ్రీమంతుడికి.. భూగర్భ కార్మికుడికి మధ్య పోటీ.. మంచిర్యాలలో కేసీఆర్

సింగరేణిని ప్రైవేటుపరం చేసే కుట్ర జరుగుతోందన్నారు. అదే జరిగితే సింగరేణి కార్మికుల బతుకులు ఆగమవుతాయని హెచ్చ‌రించారు.

ఆగర్భ శ్రీమంతుడికి.. భూగర్భ కార్మికుడికి మధ్య పోటీ.. మంచిర్యాలలో కేసీఆర్
X

పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఆగర్భ శ్రీమంతుడికి.. భూగర్భ కార్మికుడికి మధ్య పోటీ జరుగుతుందన్నారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. పోరుబాట కార్యక్రమంలో భాగంగా మంచిర్యాలలో నిర్వహించిన రోడ్‌షోలో కేసీఆర్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ 26 ఏళ్ల పాటు బొగ్గు గని కార్మికుడిగా పనిచేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు. బీజేపీతో తెలంగాణకు ఒరిగిందేం లేదని, తెలంగాణకు బీఆర్ఎస్ శ్రీ రామరక్ష అన్నారు కేసీఆర్.

సీఎం రేవంత్ రెడ్డి నోటికి ఏదోస్తే అదే మాట్లాడుతున్నారని.. ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుళ్ల మీద ఓట్లు పెడుతున్నాడని చెప్పారు కేసీఆర్. కాంగ్రెస్‌ నేతల మాటలు నమ్మేటట్లు ఉన్నాయా అంటూ ప్రజలనుద్దేశించిన ప్రశ్నించారు. సింగరేణిని ప్రైవేటుపరం చేసే కుట్ర జరుగుతోందన్నారు. అదే జరిగితే సింగరేణి కార్మికుల బతుకులు ఆగమవుతాయని హెచ్చ‌రించారు.

పార్లమెంట్ ఎన్నికలైన తర్వాత కొత్త జిల్లాలను రేవంత్ రద్దు చేస్తానంటున్నారన్నారు కేసీఆర్. పరిపాలన సౌలభ్యం కోసం ఆదిలాబాద్ జిల్లాను కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలుగా చేసుకున్నామన్నారు. మంచిర్యాల జిల్లా ఉండాలంటే బీఆర్ఎస్‌ను గెలిపించాలన్నారు కేసీఆర్.

First Published:  5 May 2024 2:56 AM GMT
Next Story