Telugu Global
Telangana

కాంగ్రెస్ కాలువలు తవ్వి గాలికి వదిలేస్తే.. బీఆర్ఎస్ ప్రభుత్వం నీళ్లిచ్చింది : గుత్తా సుఖేందర్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ హయాంలో కాలువలు తవ్వి గాలికి వదిలేశారని.. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఆ కాలువల్లో నిరు పారించిందని గుత్తా అన్నారు.

కాంగ్రెస్ కాలువలు తవ్వి గాలికి వదిలేస్తే.. బీఆర్ఎస్ ప్రభుత్వం నీళ్లిచ్చింది : గుత్తా సుఖేందర్ రెడ్డి
X

ఎల్ఎల్‌బీసీ సొరంగం పనుల్లో ఎన్నో సాంకేతిక సమస్యల కారణంగా నాలుగేళ్లుగా శ్రీశైలం ప్రాజెక్టు నీళ్లతో నిడిపోతోంది. టన్నెల్ మరమ్మతులకు గురైతే ఆరు నెలల పాటు ఆగాల్సి వస్తోంది. సొరంగం తవ్వకం పనులు ఇంకా 9 కిలోమీటర్లు మిగిలి ఉన్నదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. త్వరలోనే ఆ ప్రాజెక్టు పనులు తప్పకుండా పూర్తవుతాయని సుఖేందర్ రెడ్డి చెప్పారు. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ పాదయాత్రలు చేసి అలిసిపోయారు. ఇప్పుడు మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తున్నాడు. వీళ్లు ప్రజల కోసం పాదయాత్రలు చేయడం లేదని.. పార్టీలో ఆధిపత్యం కోసం చేస్తున్నారని సుఖేందర్ రెడ్డి విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీ హయాంలో కాలువలు తవ్వి గాలికి వదిలేశారని.. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఆ కాలువల్లో నీరు పారించిందని గుత్తా అన్నారు. మల్లు భట్టి విక్రమార్క డిండి ప్రాంతంలో పాదయాత్ర చేస్తున్నారు. డిండి ప్రాంతంలోనే రెండు పంటలకు బీఆర్ఎస్ ప్రభుత్వం నీళ్లు ఇస్తున్న విషయం మల్లు భట్టి విక్రమార్కకు కనపడం లేదా అని ప్రశ్నించారు. డిండి ఎత్తిపోతల పథకాల్లోని ప్రాజెక్టులు అన్నీ పూర్తి కావొస్తున్నాయి.. ప్రభుత్వం ఇప్పటికే రూ.2 వేల కోట్లకు పైగా నిధులు ఖర్చు చేసిందని అన్నారు.

హైదరాబాద్‌లోనీ మీ ఇంటికి కూడా నీళ్లు వస్తున్న విషయం మర్చి పోవద్దని భట్టికి సూచించారు. వైఎస్ఆర్ లాగా పంచ, దోతి కట్టడం.. మధిర నియోజకవర్గం తప్ప భట్టికి ఏమీ తెలియదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ తొమ్మిదేళ్ల పాలనలో మీ జిల్లాలో జరిగిన అభివృద్ధి తాము చేసిన ప్రగతికి నిదర్శనమని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో సీఎం అభ్యర్థులు ఎవరో కూడా తెలియదని అన్నారు.

తెలంగాణలో తామే అధికారంలోకి వస్తామని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు కలలు కంటున్నారని.. అయితే ప్రజలు మాత్రం తిరిగి కేసీఆర్ నాయకత్వాన్నే కోరుకుంటున్నారని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.

First Published:  10 Jun 2023 1:11 PM IST
Next Story