Telugu Global
Telangana

పిల్లలు చనిపోతే కానీ స్పందించరా?

మాగనూర్‌ ఘటనపై హైకోర్టు ఆగ్రహం

పిల్లలు చనిపోతే కానీ స్పందించరా?
X

నారాయణపేట జిల్లా మాగనూర్‌ జడ్పీ హైస్కూల్‌లో ఫుడ్‌ పాయిజన్‌ ఘటనపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారులు నిద్రపోతున్నారా అని ప్రశ్నించింది. వారంలో మూడుసార్లు భోజనం వికటిస్తే అధికారులు ఏం చేస్తున్నారని నిలదీసింది. స్కూల్‌లో ఫుడ్‌ పాయిజన్‌ చాలా సీరియస్‌ అంశమని పేర్కొన్నది. పిల్లలు చనిపోతే కానీ స్పందించరా అని ప్రశ్నించింది. అధికారుల నిర్లక్ష్యానికి ఇది నిదర్శనమన్నది. వారంలో కౌంటర్‌ వేస్తామన్న ప్రభుత్వ న్యాయవాదిపై తీవ్రంగా మండిపడింది.

మాగనూరు మండల కేంద్రంలో మధ్యాహ్న భోజనం వికటించి 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో సీఎం ఆరా తీశారు. ఈ నేపథ్యంలోనే జిల్లా కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ తనిఖీ చేసి విచారణ చేపట్టారు. ఈ సందర్బంగా హెచ్‌ఎం మురళీధర్‌రెడ్డి, ఇన్‌ఛార్జ్‌ హెచ్‌ఎం బాపురెడ్డిని సస్పెండ్‌ చేశారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు.

First Published:  27 Nov 2024 12:39 PM IST
Next Story