బీఆరెస్ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా దళిత బంధు, రైతులకు ఉచిత విద్యుత్తు -కేసీఆర్
ఆంధ్రప్రదేశ్ నుండి ఈ రోజు పెద్ద ఎత్తున పలువురు నాయకులు, కార్యకర్తలు బీఆరెస్ లో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో జరిగిన కార్యక్రమంలో కేసీఆర్ మాట్లాడుతూ, బీఆరెస్ ఏర్పాటు రాజకీయ క్రీడలు ఆడడానికి కాదని, ఒక లక్ష్యం కోసం ఏర్పాటు చేశామన్నారు.
బీఆరెస్ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా దళిత బంధు, రైతులకు ఉచిత విద్యుత్తు ఇస్తామని బీఆరెస్ అధ్యక్షులు కేసీఆర్ ప్రకటించారు. అంతే కాదు కేంద్ర బీజేపీ సర్కార్ అమ్మేస్తున్న విషాఖ స్టీల్ ప్లాంట్, ఎల్ ఐసీ తదితర సంస్థలను తిరిగి జాతీయం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఆం-ధ్రప్రదేశ్ నుండి ఈ రోజు పెద్ద ఎత్తున పలువురు నాయకులు, కార్యకర్తలు బీఆరెస్ లో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో జరిగిన కార్యక్రమంలో కేసీఆర్ మాట్లాడుతూ, బీఆరెస్ ఏర్పాటు రాజకీయ క్రీడలు ఆడడానికి కాదని, ఒక లక్ష్యం కోసం ఏర్పాటు చేశామన్నారు. స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ళ తర్వాత కూడా మన దేశానికి ఒక లక్ష్యం లేకుండా పోవడం దురద్రుష్టకరమన్నారు కేసీఆర్.
మన కంటే అమెరికా, చైనా ఎందుకు ముందున్నవి? అమెరికా భూభాగంలో 29 శాతం మాత్రమే వ్యవసాయ యోగ్యమైనభూములున్నాయి. చైనాలో 16 శాతం మాత్రమే సాగు యోగ్యమైన భూమి ఉంది.అదే మన దేశంలో 50 శాతం భూమి సాగుకు అనుకూలంగా ఉంది. దాదాపు 40 కోట్ల ఎకరాల భూమి వ్యవసాయానికి అనుకూలంగా ఉంది. అయినా మనమెందుకు వెనకబడి ఉన్నాం? ఇప్పటికీ ఇతర దేశాలనుంచి దిగుమతుల మీద ఎందుకు ఆధారపడుతున్నాం. మేకిన్ ఇండియా ఏమయ్యింది ? లక్షల కోట్ల రూపాయాల విలువైన పామాయిల్, కందిపప్పును దిగుమతి చేసుకుంటున్నాం. ఎందుకు ఈ దేశం వంచించబడుతున్నది. ఈ దుస్థితి కొనసాగాల్నా.'' అని కేసీఆర్ ప్రశ్నించారు.
''మన దేశంలో ప్రతి ఏడాది ఒక లక్షా 40 వేల టీఎంసీల వర్షం కురుస్తోంది. ఇది కేంద్రం చెబుతున్న లెక్క. 70 వేల టీఎంసీల నీరు ఉంది. భూమి, సోలార్, పర్యావరణ మండలాలు ఉన్నాయి. పని చేసేందుకు అవసరమైన మనషులున్నారు. తగిన పద్ధతిలో ముందుకు వెళ్తే.. ప్రపంచంలోనే ఇండియా బెస్ట్ ఫుడ్ చైన్‌కలిగి ఉండే కంట్రీగా ఉండాలి. మన రైతు లోకమంతా అద్భుతంగా జీవించాలి. కానీ 13 నెలల పాటు రైతులు ధర్నాలు చేసి, ప్రాణాలు కోల్పోయారు'' అని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ దేశం ఇప్పుడున్నట్టు ఉండకూడదని, దీన్నిమార్చాలని దేశంలో గుణాత్మకమైన మార్పు తీసుకరావాలని కేసీఆర్ అన్నారు. అందుకోసం ప్రజల ఆలోచనా సరళిలో మార్పు తేవాలని, యావత్ దేశంలో ఉన్న ఆలోచనాపరులను ఏకం చేసి ఒక మహోజ్వలమైన భారతదేశాన్ని నిర్మించడమే బీఆర్ఎస్ లక్ష్యమని కేసీఆర్ స్పష్టం చేశారు.