ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ క్లర్క్ ఫలితాలను ఇవాళ బోర్డు విడుదల చేసింది.
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ క్లర్క్ ఫలితాలను ఇవాళ బోర్డు విడుదల చేసింది. రాతపరీక్ష దేశవ్యాప్తంగా ఆగస్టు 3, 4, 10, 17 మరియు 18, 2024 తేదీల్లో వివిధ పరీక్షా కేంద్రాలలో నిర్వహించారు. ఐబీపీఎస్ అసిస్టెంట్ ప్రిలిమ్స్ ఫలితం అధికారిక వెబ్‌సైట్‌లో ibps.in ద్వారా ఫలితాలను చూడవచ్చును.
ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు మెయిన్ పరీక్షకు హాజరయ్యేందుకు అర్హులు. ఐబీపీఎస్ క్లర్క్ ప్రధాన పరీక్ష అక్టోబర్ 6, 2024న నిర్వహించబడుతుంది. ఐబీపీఎస్ ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ద్వారా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో 9,923 ఆఫీసర్, అసిస్టెంట్ ఖాళీలను భర్తీ చేస్తుంది. ప్రధాన పరీక్షలో 200 మార్కుల 200 ప్రశ్నలు ఉంటాయి. ప్రధాన పరీక్షలో రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, హిందీ లాంగ్వేజ్ మరియు న్యూమరికల్ ఎబిలిటీ నుంచి ప్రశ్నలు ఉంటాయి. సమయ వ్యవధి 2 గంటలు.