ఈ మూడు సినిమాలు ఎంతగానో నచ్చేశాయి - స్మితా సబర్వాల్
మనకు ఏదైనా సాధించాలన్న కోరిక బలంగా ఉన్నప్పుడు ప్రకృతి కూడా అందుకు సహకరిస్తుందంటూ ఓ కోట్ కూడా రాశారు స్మితా సబర్వాల్.
మొన్నటి వరకు అధికారిక కార్యక్రమాల్లో బిజిబిజీగా గడిపిన ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఇటీవల మూడు అద్భుతమైన సినిమాలు చూశానని.. అవి తనకు ఎంతగానో నచ్చాయంటూ ట్వీట్ చేశారు. హిందీలో వచ్చిన 12th ఫెయిల్, స్పానిష్ చిత్రం సొసైటీ ఆఫ్ ది స్నో, తమిళంలో వచ్చిన అన్నపూరణి సినిమాలను చూశానని ట్వీట్ చేశారు స్మితా. ఈ సినిమాలోని క్యారెక్టర్లు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని చెప్పారు. మీ లిస్టులో ఏం సినిమాలు ఉన్నాయో చెప్పాలంటూ తన ట్వీట్‌లో అడిగారు.
మనకు ఏదైనా సాధించాలన్న కోరిక బలంగా ఉన్నప్పుడు ప్రకృతి కూడా అందుకు సహకరిస్తుందంటూ ఓ కోట్ కూడా రాశారు స్మితా సబర్వాల్. ఇక గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన స్మితా సబర్వాల్ ఇటీవల బదిలీ అయిన విషయం తెలిసిందే. ఆమెను ఫైనాన్స్ కమిషన్‌కు బదిలీ చేసింది రేవంత్ సర్కార్.
Watched these amazing stories of grit & resilience and loved.. #12thFail#SocietyOfTheSnow #Annapoorani
— Smita Sabharwal (@SmitaSabharwal) January 7, 2024
When the human spirit fights the universe conspires .. to present it the earth n sky !#HappySunday guys
What’s on your list ??
స్మితా సబర్వాల్ చూసిన ఈ మూడు సినిమాలు ప్రస్తుతం ఓటీటీలో అందుబాటులో ఉన్నాయి. 12th ఫెయిల్ అనే సినిమాను అత్యంత పేదరికం నుంచి ఐపీఎస్ ఆఫీసర్‌గా మారిన మనోజ్ కుమార్ శర్మ నిజ జీవిత కథ ఆధారంగా నిర్మించారు. ఈ చిత్రంలో మేధా శంకర్, అనంత్ వి జోషి, విక్రాంత్, అన్షుమాన్ పుష్కర్ కీలక పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఈ సినిమా డిస్నీహాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది. ఇక నయనతార ప్రధాన పాత్రలో నటించిన అన్నపూరణి చిత్రం సైతం OTTలో అందుబాటులో ఉంది. సర్వైవల్ థ్రిల్లర్ సొసైటీ ఆఫ్ ది స్నో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది.