Telugu Global
Telangana

నాకు ఇష్టమైతేనే వస్తా.. మెగా బ్రదర్స్‌ను మళ్లీ కెలికిన అల్లు అర్జున్‌!

ఈ కామెంట్స్ కాస్త ఇప్పుడు వైరల్‌గా మారాయి. మెగా బ్రదర్స్‌ను ఉద్దేశించే అల్లు అర్జున్ ఈ కామెంట్స్ చేశారన్న చర్చ జరుగుతోంది.

నాకు ఇష్టమైతేనే వస్తా.. మెగా బ్రదర్స్‌ను మళ్లీ కెలికిన అల్లు అర్జున్‌!
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి హాట్‌ కామెంట్స్ చేశారు. రావు రమేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మారుతినగర్ సుబ్రమణ్యం సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ బుధవారం జరిగింది. ఈ ఈవెంట్‌కు అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కాగా, ఈ ఈవెంట్‌లో అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి.

ఇంతకీ అల్లు అర్జున్ ఏమన్నారంటే!

మారుతినగర్ సుబ్రమణ్యం సినిమా సుకుమార్ భార్య తబితా సుకుమార్ సమర్పణ‌లో వ‌స్తుంద‌ని, ఆమె ఒక రోజు వచ్చి తనకు ఈ విషయం చెప్పారన్నారు అల్లు అర్జున్. ఎలాగూ సుకుమార్‌ వస్తారు. సుకుమార్‌ను తప్పిస్తే.. మిమ్మల్ని కాకుండా ఇంకా ఎవరిని అడగగలను అని ఆమె నాతో చెప్పిందని, ఆ మాట‌తో తాను వస్తానని ఆమెకు మాట ఇచ్చానన్నారు. పుష్ప క్లైమాక్స్ చాలా టఫ్ షూట్ అన్న అల్లు అర్జున్ అలాంటి సిచ్యూయేషన్‌లోనూ ఇక్కడకు రావాలనుకున్నానని చెప్పారు. మనకు ఇష్టమైన వారికి మన సపోర్ట్ చూపించాలని, నాకు ఇష్టమైతే నేను వస్తా, నా మనసుకు నచ్చితే వస్తా, అది మీ అందరికీ తెలిసిందే అంటూ కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ కాస్త ఇప్పుడు వైరల్‌గా మారాయి. మెగా బ్రదర్స్‌ను ఉద్దేశించే అల్లు అర్జున్ ఈ కామెంట్స్ చేశారన్న చర్చ జరుగుతోంది.


ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి మెగా ఫ్యామిలీ, అల్లు అర్జున్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికి అల్లు అర్జున్ మద్దతు తెలపడం, ఆయన కోసం నంద్యాలకు వెళ్లడం తీవ్ర చర్చకు దారి తీసింది. దీంతో మెగా బ్రదర్ నాగబాబు పరోక్షంగా అల్లు అర్జున్‌ను ఉద్దేశించి ట్వీట్ చేయడంతో వివాదం కాస్త ముదిరింది. అయితే తర్వాత డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు బన్నీ శుభాకాంక్షలు తెలియజేయడంతో అంతా సద్దుమణిగిందనుకున్నారు. కానీ తాజాగా అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలతో మరోసారి వివాదాన్ని కెలికినట్లయింది.

First Published:  22 Aug 2024 8:33 AM IST
Next Story