వేలెంటైన్స్ డే రోజు.. ఐ లవ్ యూ కేసీఆర్ అంటూ ట్వీట్..
తెలంగాణ సీఎం కేసీఆర్ అమూల్యమైన సేవలు ఈ దేశానికి అవసరమని.. యాదగిరిగుట్ట నరసింహస్వామి ఆలయం చూసిన తర్వాత ఈ రాష్ట్రాన్నే కాకుండా.. దేశాన్ని కూడా అద్భుతమైన ప్రగతి వైపు నడిపించే సత్తా, సామర్థ్యం ఉన్నట్లు నమ్ముతున్నానని పేర్కొన్నారు.
వేలెంటైన్స్ డే రోజు 'ఐ లవ్ యూ కేసీఆర్ గారూ' అంటూ టాలీవుడ్ యాక్టర్, నిర్మాత బండ్ల గణేష్ పెట్టిన ట్వీట్ వైరల్‌గా మారింది. ఎప్పుడూ తన కాంట్రవర్షియల్ కామెంట్లతో వార్తల్లో ఉండే బండ్ల గణేశ్ ఈ సారి మాత్రం కేసీఆర్ చేస్తున్న అభివృద్థి, అమలు చేస్తున్న పథకాలను మెచ్చుకుంటూ ట్వీట్స్ చేశారు. తొలి సారిగా యాదాద్రి నరసింహస్వామిని దర్శించుకున్న సందర్భంగా ఆయన ట్విట్టర్ వేదికగా సీఎం కేసీఆర్‌ను పొగడ్తలతో ముంచెత్తారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ అమూల్యమైన సేవలు ఈ దేశానికి అవసరమని.. యాదగిరిగుట్ట నరసింహస్వామి ఆలయం చూసిన తర్వాత ఈ రాష్ట్రాన్నే కాకుండా.. దేశాన్ని కూడా అద్భుతమైన ప్రగతి వైపు నడిపించే సత్తా, సామర్థ్యం ఉన్నట్లు నమ్ముతున్నానని పేర్కొన్నారు. ఎన్నో రోజుల నుంచి యాదాద్రి రావాలని, స్వామి వారిని దర్శించుకోవాలని భావించాను. అయితే, వారి అనుగ్రహం లేక నాకు రావడం కుదరలేదు. ఇవ్వాళ మాత్రం స్వామి వారి అనుగ్రహం కారణంగా కుటుంబ సమేతంగా వచ్చి నరసింహస్వామిని దర్శించుకోవడం ఆనందాన్ని ఇచ్చిందన్నారు.
యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి తెలంగాణ ప్రగతిపథం వైపు వెళ్తోందనడానికి నిదర్శనమని గణేశ్ పేర్కొన్నారు. కేసీఆర్ ఆలోచన, ఆచరణ.. ఇవే కాకుండా ఆయన నిర్మిస్తున్న ప్రాజెక్టులు చూసి తృప్తి చెందానని బండ్ల గణేశ్ వెల్లడించారు. ముఖ్యమంత్రి గారూ మీకు హృదయ పూర్వక కృతజ్ఞతలని అన్నారు. ఈ రోజు ఇండియాలోనే చిన్న రాష్ట్రమైన తెలంగాణను నెంబర్ వన్‌గా తీర్చిదిద్దడంలో మీ ఆలోచన, మీ కఠోర తపస్సు, ముక్కు సూటితనం ఎంతో ఉపయోగపడిందన్నారు.
ఏ స్వార్థ్యం కోసమే.. ఏ లబ్ది కోసమే.. మీ దగ్గర ఏదో ఆశించో నేను చెప్పడం లేదు. నా మనసులో మాటలు చెప్తున్నాను. మంచి చేస్తే మంచి అని చెప్తాను.. లేకపోతే మౌనంగా ఉంటాను. అది నైజం సార్. మీరు అద్భుతం.. యూ ఆర్ ఏ వండర్ ఫుల్, యు ఆర్ ఫ్యూచర్ ఆఫ్ ఇండియా.. లవ్ యూ కేసీఆర్ గారూ అంటూ బండ్ల గణేశ్ ఉద్వేగంగా ట్వీట్ చేశారు.
ఏ స్వార్థం కోసమో.. ఏ లబ్ధి కోసమో మీ దగ్గర ఏది ఆశించో నేను చెప్పట్లేదు. నా మనసులోని మాటలు చెప్తున్నాను. మంచి చేస్తే మంచి అని చెప్తాను, లేకపోతే మౌనంగా ఉంటాను. అది నా నైజం సార్..! మీరు అద్భుతం, యువర్ ఏ వండర్ ఫుల్, యువర్ ఫీచర్ ఆఫ్ ఇండియా.. లవ్ యు కేసీఆర్ గారు @TelanganaCMO pic.twitter.com/ojS9QNgc2G
— BANDLA GANESH. (@ganeshbandla) February 14, 2023