Telugu Global
Telangana

ఆ వీడియోతో నాకు సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ సమాధానం

ఈ కేసులో ఇప్పటికే అస్సాంలో ఒకరిని, గుజరాత్‌లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే పీఏను ఆయా రాష్ట్రాల పోలీసులు అరెస్టు చేశారు. ఇక సికింద్రాబాద్‌ శాంతినగర్‌కు చెందిన కాంగ్రెస్‌ సోషల్‌మీడియా వారియర్ గీతా ఫోన్‌ను ఢిల్లీ పోలీసులు సీజ్ చేశారు.

ఆ వీడియోతో నాకు సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ సమాధానం
X

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు సంబంధించిన ఫేక్ వీడియో కేసులో ఢిల్లీ పోలీసులు జారీ చేసిన నోటీసులకు సమాధానం పంపించారు సీఎం రేవంత్ రెడ్డి. అమిత్ షా ఫేక్‌ వీడియో షేరింగ్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తరఫున ఢిల్లీ పోలీసులకు అడ్వకేట్ సామ్య గుప్తా వివరణ ఇచ్చారు. INC తెలంగాణ ట్విట్టర్ రేవంత్ రెడ్డిది కాదన్నారు సౌమ్య గుప్తా. INC ట్విట్టర్ ఖాతాను రేవంత్ రెడ్డి హ్యాండిల్ చేయడం లేదన్నారు. రేవంత్‌ రెడ్డికి పర్సనల్ ట్విట్టర్ అకౌంట్‌తో పాటు తెలంగాణ సీఎంవో అకౌంట్స్‌ మాత్రమే ఉన్నాయని ఢిల్లీ పోలీసులకు క్లారిటీ ఇచ్చారు సౌమ్య గుప్తా.

రిజర్వేషన్ల అంశంపై అమిత్ షాకు సంబంధించిన ఓ వీడియోను ఎడిట్ చేసి సోషల్‌మీడియాలో వైరల్ చేసిన కేసులో సీఎం రేవంత్‌తో పాటు కాంగ్రెస్‌ సోషల్‌మీడియా ఛైర్మన్ మన్నె సతీష్‌, స్టేట్ సెక్రటరీ శివకుమార్ సహా పలువురు నేతలకు ఇటీవల ఢిల్లీ పోలీసులు నోటీసులు అందించారు. మే 1న విచారణకు హాజరుకావాలని ఢిల్లీ పోలీసులు కోరగా.. తాజాగా లాయర్‌ ద్వారా వివరణ ఇచ్చారు రేవంత్ రెడ్డి.


ఈ కేసులో ఇప్పటికే అస్సాంలో ఒకరిని, గుజరాత్‌లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే పీఏను ఆయా రాష్ట్రాల పోలీసులు అరెస్టు చేశారు. ఇక సికింద్రాబాద్‌ శాంతినగర్‌కు చెందిన కాంగ్రెస్‌ సోషల్‌మీడియా వారియర్ గీతా ఫోన్‌ను ఢిల్లీ పోలీసులు సీజ్ చేశారు. ఆమెకు CRPC-41 A కింద నోటీసులు ఇచ్చారు.

First Published:  1 May 2024 10:26 AM GMT
Next Story