Telugu Global
Telangana

నాకు ఎలాంటి ఈడీ నోటీసు అందలేదు... కవిత ప్రకటన‌

తనకు ఎలాంటి నోటీసులు రాలేదని కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో తనకు ఈడీ నోటీసులు ఇచ్చిందన్న మీడియా వార్తలను ఆమె ఖండించారు.

నాకు ఎలాంటి ఈడీ నోటీసు అందలేదు... కవిత ప్రకటన‌
X

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తెలంగాణ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు అందజేసిందన్న వార్తలను ఆమె ఖండించారు. కవితకు ఈ రోజు ఈడీ నోటీసులు అందించిందని, ఆమె కరోనా తో హోం కోరంటైన్ లో ఉండటం వల్ల అధికారులు ఆమె సహాయకులకు నోటీసులు అందించారని మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ వార్తలన్నీ తప్పుడు వార్తలని కవిత స్పష్టం చేస్తూ ట్వీట్ చేశారు.

''ఢిల్లీలో కూర్చున్న‌ కొంత మంది దురుద్దేశంతో మీడియాను తప్పుదోవ పట్టిస్తున్నారు. టీవీ వీక్షకుల విలువైన సమయాన్ని వృధా చేయకుండా మీ సమయాన్ని నిజం చూపించడానికి ఉపయోగించమని నేను అన్ని మీడియా సంస్థలను అభ్యర్థిస్తున్నాను. నాకు ఎలాంటి నోటీసులు అందలేదని స్పష్టం చేస్తున్నాను.'' అని కవిత ట్వీట్ చేశారు.

కాగా ఢిల్లీ లిక్కర్ స్కాం కు సంబంధించి ఈడీ దేశవ్యాప్తంగా 40 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోందని మీడియా పేర్కొంటోంది. ఒక్క హైదరాబాద్ లోనే 25 చోట్ల ఈడీ సోదాలు నిర్వహించిందని తెలుగు మీడియా చెప్తోంది. తెలంగాణతో పాటు, ఏపీ, తమిళనాడు, కర్నాటక, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయని మీడియా వార్తలు.

First Published:  16 Sept 2022 4:48 PM IST
Next Story