నేను ఏ తప్పు చేయలేదు.. సీఎం రేవంత్, పవన్‌ను కలుస్తా - హేమ
తాజాగా సోషల్‌మీడియా వేదికగా ఓ వీడియో రిలీజ్ చేశారు హేమ. తనపై నిరాధారమైన ఆరోపణలు చేశారని, 30 ఏళ్లుగా సంపాదించుకున్న తన పరువుకు భూస్థాపితం చేశారంటూ ఆ వీడియోలో చెప్పారు.
రెండు నెలల క్రితం బెంగళూరు శివారులో జరిగిన రేవ్ పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ పార్టీలో నటి హేమతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు, హైదరాబాద్‌కు చెందిన టెకీలు పాల్గొన్నట్లు వార్తలు వచ్చాయి. హేమ మాత్రం తాను పార్టీలో పాల్గొనలేదంటూ వీడియోలు రిలీజ్ చేసింది. ఈ ఇష్యూకు సంబంధించి దాదాపు ఓ పది రోజుల పాటు హైడ్రామా కొనసాగింది. తర్వాత బెంగళూరు పోలీసులు హేమను అరెస్టు చేసి జైలులోనూ ఉంచారు.
నేను డ్రగ్స్ తీసుకోలేదు.. పరువు భూస్థాపితం చేశారు.. సీఎం రేవంత్ రెడ్డి ,డిప్యూటీ సీఎం పవన్ అపాయింట్మెంట్ కావాలి!#ActressHema #Drugs #DCM #CMRevanthReddy #PawanKalyan pic.twitter.com/wuRZl3A6yW
— Suresh Kondeti (@santoshamsuresh) August 20, 2024
తర్వాత హేమ బెయిల్ మీద బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అయినప్పటికీ హేమ తానేమి తప్పు చేయలేదని, డ్రగ్స్ తీసుకోలేదని పలు ఇంటర్వ్యూల్లో చెప్పింది. దీంతో ఆమెపై ట్రోల్స్ నడిచాయి. తాజాగా సోషల్‌మీడియా వేదికగా ఓ వీడియో రిలీజ్ చేశారు హేమ. తనపై నిరాధారమైన ఆరోపణలు చేశారని, 30 ఏళ్లుగా సంపాదించుకున్న తన పరువుకు భూస్థాపితం చేశారంటూ ఆ వీడియోలో చెప్పారు. శాంపిల్స్ ఇవ్వకుండానే, తనకు పాజిటివ్ వచ్చిందని ప్రచారం చేశారన్నారు హేమ.
తాజాగా తాను టెస్టులు చేయించుకున్నానని, జుట్టుతో పాటు గోర్లు, బ్లడ్ అన్నీ టెస్టులు చేయించుకుంటే తనకు డ్రగ్స్ నెగెటివ్ రిపోర్టు వచ్చిందని వీడియోలో చెప్పారు హేమ. ఇప్పుడు తాను ఎలాంటి టెస్టుకైనా సిద్ధంగా ఉన్నానని చెప్పడానికే వీడియో చేస్తున్నానని చెప్పారు. తనను బ్లాక్మెయిల్ చేసిన వారి వివరాలు త్వరలో బయటపెడతానన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ను త్వరలోనే కలుస్తానన్నారు.