ఇథనాల్ కంపెనీతో నాకు సంబంధం లేదు
ఎవరైనా రుజువు చేస్తే వారికే అప్పగిస్తా : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
BY Naveen Kamera27 Nov 2024 9:52 PM IST
X
Naveen Kamera Updated On: 27 Nov 2024 9:52 PM IST
నిర్మల్ జిల్లాలో ఏర్పాటు చేయబోయే ఇథనాల్ కంపెనీతో తనకు, తన కుటుంబ సభ్యులకు ఎలాంటి సంబంధం లేదని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉన్నత పదవుల్లో ఉన్న వాళ్లు బాధ్యతగా మాట్లాడాలని, ఎదుటి వారిపై ఆరోపణలు చేసేప్పుడు వాస్తవాలు తెలుసుకోవాలని అన్నారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఇనకైనా మానుకోవాలన్నారు. సదరు ఇథనాల్ కంపెనీ విషయంలో తమ కుటుంబంపై చేసిన ఆరోపణలన్నీ అవాస్తమేనని తెలిపారు. ఆ ఇథనాల్ కంపెనీలో తమ కుటుంబానికి భాగస్వామ్యం ఉన్నట్టు నిరూపించే వ్యక్తులు, పార్టీకే దానిని అప్పగిస్తామని తేల్చిచెప్పారు.
Next Story