నేను తెలంగాణలో ఉన్నాను, ఏపీ రాజకీయాలతో నాకేం పని ? -చిరంజీవి
తాను రాజకీయాలు పూర్తిగా వదిలేశానని ఇప్పటికే అనేక సార్లు చెప్పాను. తన దృష్టంతా సినిమాల మీదనే ఉందని చిరంజీవి అన్నారు. ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తాను రాజకీయాలు పట్టించుకోవడం పూర్తిగా మానేశానని, తన ఇంటికి న్యూస్ పేపర్లు కూడా తెప్పించనని చెప్పారు.

తాను ఉండేది తెలంగాణలో , ఓటు హక్కు కూడా తెలంగాణలోనే ఉంది. అలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నాకెందుకు? అని టాలీ వుడ్ హీరో చిరంజీవి ప్రశ్నించారు.
ఏపీ రాజకీయాలతో తనకు సంబంధం లేదని,ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతోందో తనకు తెలియదని, తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా తనకు లేదని అన్నారు.
తాను రాజకీయాలు పూర్తిగా వదిలేశానని ఇప్పటికే అనేక సార్లు చెప్పాను. తన దృష్టంతా సినిమాల మీదనే ఉందని చిరంజీవి అన్నారు. ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తాను రాజకీయాలు పట్టించుకోవడం పూర్తిగా మానేశానని, తన ఇంటికి న్యూస్ పేపర్లు కూడా తెప్పించనని చెప్పారు.
తనకు విశాఖలో ఇల్లు ఉండాలని కోరికున్న మాట నిజమే కానీ దానికి రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు అని చిరంజీవి స్పష్టం చేశారు.
చిరంజీవి మాటలను బట్టి రాబోయే ఏపీ ఎన్నికల్లో తన తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి ఎలాంటి సహాయం చేయబోవడం లేదని స్పష్టమవుతున్నదని వైసీపీ నేతలు అంటున్నారు.