Telugu Global
Telangana

మాదాపూర్‌లో హైడ్రా కూల్చివేతలు..ప్రజల్లో గుబులు

మాదాపూర్ లోని అయ్యప్ప సొసైటీలో అక్రమంగా నిర్మించిన ఐదంస్థుల భవనాన్ని హైడ్రా కూల్చివేసింది

మాదాపూర్‌లో హైడ్రా కూల్చివేతలు..ప్రజల్లో గుబులు
X

హైదరాబాద్‌లోని మాదాపూర్ లోని హైడ్రా కూల్చివేతలు మొదలు పెట్టింది. అయ్యప్ప సొసైటీలోని 100 ఫీట్ రోడ్ కు ఆనుకుని ఉన్న ఈ భవనం అక్రమ కట్టడమని హైడ్రాతో పాటు హైకోర్టు కూడా ఇప్పటికే నిర్ధారించింది. బిల్డింగ్ యజమానికి గతేడాదే నోటీసులు జారీ చేసినట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే హైడ్రా అధికారులు ఆదివారం ఉదయం బిల్డింగ్ కూల్చివేత పనులు మొదలు పెట్టారు.

ఈ మేరకు హైడ్రా బృందాలు, పోలీసులు అక్రమ నిర్మాణం వద్దకు భారీగా చేరుకున్నారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అయ్యప్ప సొసైటీలో 684 గ‌జాల‌ స్థలంలో ఐదంతస్తుల భవనాన్ని అక్రమంగా నిర్మించారు. జీహెచ్‌ఎంసీ నోటీసులు, హైకోర్టు ఉత్తర్వులు ప‌ట్టించుకోకుండా సెల్లార్‌, గ్రౌండ్‌ఫ్లోర్‌తోపాటు ఐదంత‌స్తుల బిల్డింగ్‌ను ఓ వ్యక్తి కట్టారు. దీనిపై స్థానికుల నుంచి హైడ్రాకు పెద్దఎత్తున ఫిర్యాదులు అందాయి.

First Published:  5 Jan 2025 12:04 PM IST
Next Story