బతుకమ్మ కుంటను సందర్శించిన హైడ్రా కమిషనర్..మళ్లీ అలర్ట్
బాగ్ అంబర్‌పేట్‌లోని బతుకమ్మ కుంటను హైడ్రా కమీషనర్ ఎ.వి. రంగనాథ్ ఇవాళ సందర్శించారు
హైదరాబాద్ బాగ్ అంబర్‌పేట్‌లో బతుకమ్మ కుంటను హైడ్ర కమీషనర్ రంగనాథ్ ఇవాళ సందర్శించారు. బతుకమ్మకుంటను రెండు నెలల్లో పునరుద్దరిస్తామని తెలిపారు. చెరువు అక్రమణపై స్థానికులతో మాట్లాడారు. ప్రజలు తమ ఇళ్లు కూల్చేస్తారా అంటూ స్థానికులు కమిషనర్‌ను ప్రశ్నించగా ఇళ్లు, నివాస స్థలాల జోలికి వెళ్లబోమని హైడ్రా కమిషనర్ స్పష్టం చేశారు. ఇప్పుడున్న ఐదు ఎకరాల స్థలంలోనే పునరుద్దరణ పనులు చేపడుతామని స్థానికుల ఇండ్ల జోలికి వెళ్లమని ఆయన తెలిపారు. కాగా, గతంలోనే బతుకమ్మ కుంట కబ్జాకు గురైందని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా భారీగా పోలీసుల మోహరించారు.1962 లెక్కల ప్రకారం బతుకమ్మకుంట 16.13 ఎకరాల విస్తీర్ణంలో ఉందని కానీ ప్రస్తుతం 5.15 ఎకరాలకు కుచించుకుపోయిందన్నారు. స్థానికుల విజ్ఞప్తితోనే బతుకమ్మ కుంట పునరుద్ధరణకు హైడ్రా నిర్ణయం తీసుకుందన్నారు. నగరంలో మళ్లీ హైడ్రా కూల్చివేతలు మొదలైయి. మేడ్చల్ - నాగారం మున్సిపాలిటీ పరిధిలో హైడ్రా రెండు టీమ్స్ గా ఏర్పాటై కూల్చివేస్తున్నారు. రాంపల్లి సమీపంలో రాజ్ సుఖ్ నగర్ కాలనీలో మెయిన్ రోడ్డు పక్కన ఉన్న నిర్మాణాలను హైడ్రా అధికారులు జేసిబి సహాయంతో కూల్చివేస్తున్నారు.