Telugu Global
Telangana

200ఏళ్ళ చరిత్ర కలిగిన లాడ్ బజార్ పునర్ వైభవానికి ప్రభుత్వ కృషి

ఒక కిలో మీటర్ కన్నా ఎక్కువ వ్యాపించి ఉన్న ఈ లాడ్ బజార్ నిజాంకాలంలో ప్రారంభమయ్యింది. ఇది అనేక రకాల గాజులకు ప్రతీతి. ప్రపంచవ్యాప్తంగా ఉండే అన్ని రకాల గాజులు ఇక్కడ లభిస్తాయి. ఇక్కడ ఇత్తడి,వెండి ఫ్రేమ్డ్ బ్యాంగిల్స్‌తో పాటు ముత్యాలు పొదిగిన గాజులు కూడా లభిస్తాయి.

200ఏళ్ళ చరిత్ర కలిగిన లాడ్ బజార్ పునర్ వైభవానికి ప్రభుత్వ కృషి
X

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన 200 ఏళ్ళ చరిత్ర కలిగిన హైదరాబాద్ లోని లాడ్ బజార్, చార్మినార్ సమీపంలోని ప్రముఖ బ్యాంగిల్ మార్కెట్. దాని గత వైభవాన్ని తిరిగి పొందేందుకు సిద్ధంగా ఉంది.

ఒక కిలో మీటర్ కన్నా ఎక్కువ వ్యాపించి ఉన్న ఈ లాడ్ బజార్ నిజాంకాలంలో ప్రారంభమయ్యింది. ఇది అనేక రకాల గాజులకు ప్రతీతి. ప్రపంచవ్యాప్తంగా ఉండే అన్ని రకాల గాజులు ఇక్కడ లభిస్తాయి. ఇక్కడ ఇత్తడి,వెండి ఫ్రేమ్డ్ బ్యాంగిల్స్‌తో పాటు ముత్యాలు పొదిగిన గాజులు కూడా లభిస్తాయి. హైదరాబాద్ ను చూడడానికి వచ్చిన వారు, ముఖ్యంగా స్త్రీలు లాడ్ బజార్ వెళ్ళకపోతే వారి హైదరాబాద్ పర్యటన పరి పూర్తికాదు. తక్కువ ధరలోనే మంచి క్వాలిటీ గాజులు ఇక్కడ లభిస్తాయి. ఇంట్లో వివాహం జరిగితే వారు లాడ్ బజార్ లో షాపింగ్ చేయకుండా ఉండరు. గతంలో నిజాం రాణులు, వారి అతిథులతో సహా సామాన్య ప్రజలకు కూడా లాడ్ బజార్ ప్రధాన షాపింగ్ మాల్. ఇప్పటికీ విదేశాల నుంచి హైదరాబాద్ కు వచ్చే టూరిస్టులు లాడ్ బజార్ ను తప్పకుండా సంద‌ర్శిస్తారు

అలాంటి లాడ్ బజార్ వైభవం మెల్లెగా మసకబారింది. అయితే దాని వైభవాన్ని పునరుద్దరించడానికి తెలంగాణ ప్రభుత్వ నడుంభిగించింది.

చారిత్రాత్మక మార్కెట్‌ శోభను పునరుజ్జీవింపజేసే కసరత్తులో భాగంగా ప్రయత్నాలు సాగుతున్నాయి దుకాణాలకు ఫ్రంట్ పార్ట్ ఎలా ఉండాలో ఖరారు చేశారు. ఇప్పుడు, లాడ్ బజార్‌లోని అన్ని దుకాణాల ఫ్రంట్ పార్ట్ లు నేమ్ బోర్డుల రూపకల్పనతో సహా ఒకే రకమైన‌ డిజైన్‌ను కలిగి ఉంటాయి.

"ప్రస్తుతం, రెండు దుకాణాలు ఇప్పటికే పునరుద్ధరించబడ్డాయి. లాడ్ బజార్‌లోని అన్ని దుకాణాలకు ఇదే నమూనా రూపొందిస్తాము" అని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) అధికారి తెలిపారు.

శతాబ్దాల నాటి ఈ మార్కెట్‌ను కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఒక సంవత్సరంలోపు పునరుద్ధరించనుంది. మార్కెట్‌ను మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అరవింద్‌ కుమార్‌ శుక్రవారం పరిశీలించారు.

తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టిఎస్‌టిడిసి) ప్రకారం, లాడ్ బజార్, గతంలో లార్డ్ బజార్‌గా పిలువబడింది, రంగు రాళ్లతో పొదిగిన గాజులను విక్రయించే 350 కంటే ఎక్కువ దుకాణాలు ఉన్నాయి. ఒక కిలోమీటరు కంటే ఎక్కువ పొడవైన షాపింగ్ స్ట్రిప్‌లో, గాజులు, పెళ్లికి సంబంధించిన వస్తువులు, చీరలు, తక్కువ ధరకు ఆభరణాలు విక్రయించే దుకాణాలు ఉన్నాయి.

చార్మినార్ నుండి వెళ్ళే నాలుగు ప్రధాన మార్గాలలో ఒకదానిలో ఉన్న ఈ మార్కెట్‌కు ప్రతిరోజూ అనేక మంది ప్రజలు వస్తుంటారు. ఈ దుకాణాలు దాదాపు 200 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నాయి. ఇప్పటికీ కొనుగోలుదారులను ఆకర్షిస్తూనే ఉన్నాయి. ఇక్కడ ఇత్తడి, వెండి ఫ్రేమ్డ్ బ్యాంగిల్స్‌తో ముత్యాలు పొదిగినవి కూడా వివాహాలకు బాగా డిమాండ్‌ను కలిగి ఉన్నాయి.

First Published:  4 Feb 2023 1:55 AM GMT
Next Story