Telugu Global
Telangana

న్యూయార్క్‌తో సమానంగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తా : సీఎం రేవంత్‌

ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఐమ్యాక్స్‌ సమీపంలోని హెచ్‌ఎండీఏ మైదానంలో రైజింగ్‌ వేడుకలు నిర్వహించారు.

న్యూయార్క్‌తో సమానంగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తా : సీఎం రేవంత్‌
X

కాంగ్రెస్ ఏడాది ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లో రైజింగ్‌ వేడుకలు నిర్వహించారు. ఐమ్యాక్స్‌ సమీపంలోని హెచ్‌ఎండీఏ మైదానంలో జరిగిన ఈ వేడుకలకు సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్‌, శ్రీధర్‌బాబు హాజరయ్యారు. ఈ సందర్బంగా పలు కీలక ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి శ్రీకారం చూట్టారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రూ.150 కోట్లతో వివిధ అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి పర్చువల్‌గా ప్రారంభించారు. రూ.3,500 కోట్లతో రహదారి అభివృద్ధి పనులనకు సీఎం శంకుస్థాపన చేశారు.

రూ.16.50 కోట్లతో నిర్మించిన భూగర్భ సంపులను ప్రారంభించారు. దేశంలోనే అతిపెద్ద ఎస్టీపీని సీఎం ప్రారంభించారు. కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ చేపట్టబోయే 6 జంక్షన్ల అభివృద్ధి, 7 ఫ్లైఓవర్లు, అండర్‌ పాస్‌ పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులకు భద్రత కిట్లను అందించారు. న్యూయార్క్, టోక్యోతో సమానంగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ తెలిపారు. తెలంగాణ ఖజనాకు 65 శాతం ఆదాయం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచే వస్తోందని సీఎం అన్నారు. గత ముఖ్యమంత్రుల ముందుచూపు వల్లే ఇది సాధ్యమైందని ఆయన అన్నారు.

First Published:  3 Dec 2024 6:29 PM IST
Next Story