Home > NEWS > Telangana > 39 డిగ్రీల సెల్సియస్ ఉష్ణొగ్రతలతో ఉడికి పోతున్న హైదరాబాద్ వాసులకు ఉపశమనం కలిగించే వార్త
39 డిగ్రీల సెల్సియస్ ఉష్ణొగ్రతలతో ఉడికి పోతున్న హైదరాబాద్ వాసులకు ఉపశమనం కలిగించే వార్త
తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో ఉరుములు లేదా మెరుపులతో తేలికపాటి నుండి మోస్తరు చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
BY Telugu Global4 April 2023 4:37 PM IST

X
Telugu Global Updated On: 4 April 2023 4:38 PM IST
హైదరాబాద్ లో గురు, శుక్రవారాల్లో రాత్రుళ్ళు ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. శనివారం నగరంలో పాక్షికంగా మేఘావృతమై ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.
రాబోయే ఐదు రోజుల పాటు నగరంలో సగటు గరిష్ట ఉష్ణోగ్రత 37 నుండి 38 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుందని IMD అంచనా వేసింది.
తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో ఉరుములు లేదా మెరుపులతో తేలికపాటి నుండి మోస్తరు చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
గత కొన్ని రోజులుగా ఉక్కపోతతో అల్లాడుతున్న హైదరాబాద్ నగర వాసులకు IMD అంచనా కొంత ఉపశమనం కలిగించవచ్చు.
Next Story