హైదరాబాద్: ఆకాశంలో కదులుతున్న తెల్లటి వస్తువు .... సైంటిస్టులు ఏమంటున్నారు ?
ఓ తెల్లటి వస్తువు కదులుతూ వెళ్తున్న ఆ దృశ్యాన్ని చూసిన వారు ఆశ్చర్యానికి లోనయ్యారు. అది గ్రహమా, నక్షత్రమా, లేక గ్రహాంతర నౌకనా అనే రకరకాల చర్చలు చేశారు.
ఈ రోజు ఉదయం నిద్ర లేచి ఆకాశంలోకి చూసిన హైదరాబాదీలకు ఓ వింత దృశ్యం కనిపించింది. ఓ తెల్లటి వస్తువు కదులుతూ వెళ్తున్న ఆ దృశ్యాన్ని చూసిన వారు ఆశ్చర్యానికి లోనయ్యారు. అది గ్రహమా, నక్షత్రమా, లేక గ్రహాంతర నౌకనా అనే రకరకాల చర్చలు చేశారు.
అయితే, ఇది నేషనల్ బెలూన్ ఫెసిలిటీ పంపిన పరిశోధన బెలూన్ అని ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ రఘునందన్ స్పష్టం చేశారు.
"ఈ రోజు ఉదయం 7:30 గంటలకు ఆకాశంలో కనిపించిన తెల్లని రంగు వస్తువు గురించి చాలా మంది నన్ను అడిగారు. ఇది కేవలం పరిశోధన హీలియం బెలూన్. ఇది ప్రాథమికంగా వాతావరణ అధ్యయనాల కోసం పంపబడుతుంది. ఈ బెలూన్ దాదాపు 1,000 కిలోల బరువున్న పరికరాన్ని కలిగి ఉంటుంది. 'ఫెసిలిటీ రీసెర్చ్' బెలూన్‌ను విడుదల చేయనున్నట్లు గత నెలలోనే నోటీసు జారీ చేసింది, "అని ఆయన చెప్పారు.
ఈ బెలూన్ లో ఉన్న పరికరం సహాయంతో వివిధ ఎత్తులలో ఒత్తిడి, ఉష్ణోగ్రత, తేమ, గాలి వేగం మార్పులను లెక్కిస్తారు. వాతావరణ సౌండింగ్ గ్రాఫ్‌లు దీని నుండి తీసుకోబడతాయి. ఇది వాతావరణాన్ని అంచనా వేయడంలో సహాయపడుతుంది.
Update For Curious Hyderabadis
— Hi Hyderabad (@HiHyderabad) December 7, 2022
It's An Atmosphere Research Balloon Sent By National Balloon Facility - Hyderabadpic.twitter.com/H1XHnLGCSb
కాగా ఈ బెలూన్ వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం మొగిలిగుండ్ల అటవీప్రాంతంలో సేఫ్‌గా ల్యాండ్ అయ్యింది. గుండ్రంగా ఉన్న భారీ వస్తువు పంటపొలాల్లో ప్రత్యక్షమవ్వడంతో స్థానికులు ఆశ్చర్యానికి, భయాందోళనకు గురయ్యారు. దానిలోపల కెమెరాలు ఉన్నట్టు గుర్తించారు. అలాగే లోపల కూర్చోవడానికి సీటు కూడా ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు.