Telugu Global
Telangana

24 గంటల వ్యవధిలో 5 హత్యలు.. - హైదరాబాద్‌ నగరంలో వరుస ఘటనలు

మరోపక్క కాచిగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఖిజార్‌ అనే వ్యక్తిని దుండగులు హతమార్చారు. సికింద్రాబాద్‌లోని తుకారాం గేట్‌ పోలీసు స్టేషన్‌ పరిధి అడ్డగుట్టలో రోజా (31)ను ఆమె భర్త లక్ష్మణ్‌ (34) హత్య చేశాడు.

24 గంటల వ్యవధిలో 5 హత్యలు..  - హైదరాబాద్‌ నగరంలో వరుస ఘటనలు
X

హైదరాబాద్‌ నగరంలో గత 24 గంటల వ్యవధిలో 5 హత్యలు జరిగాయి. పలు ప్రాంతాల్లో జరిగిన ఈ ఘటనలు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఈ ఘటనలు స్థానికులను కలవరానికి గురిచేస్తున్నాయి. ఈ ఘటనలకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

పాతబస్తీ శాలిబండ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నిమ్రా ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ యజమాని రఫీక్‌ షిమ్లాన్‌ (40) దారుణ హత్యకు గురయ్యాడు. కాలాపత్తర్‌ పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీటర్‌గా ఉన్న అసద్‌ (30), కాలాపత్తర్‌కు చెందిన అన్వర్‌ (40) ఈ దారుణానికి ఒడిగట్టారు. వీరి దాడిలో వాజిద్, సాజిద్, ఖదీర్‌లు గాయపడ్డారు. ఘటన అనంతరం నిందితులు పరారయ్యారు. మంగళవారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఈ ఘటన జరిగింది. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

మరోపక్క కాచిగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఖిజార్‌ అనే వ్యక్తిని దుండగులు హతమార్చారు. సికింద్రాబాద్‌లోని తుకారాం గేట్‌ పోలీసు స్టేషన్‌ పరిధి అడ్డగుట్టలో రోజా (31)ను ఆమె భర్త లక్ష్మణ్‌ (34) హత్య చేశాడు. భార్యపై అనుమానంతో అతను ఈ దారుణానికి పాల్పడ్డట్టు తెలిసింది. ఇక ఆసిఫ్‌ నగర్‌లోనూ మరో హత్య జరిగింది. అలీం అనే వ్యక్తిని పలువురు దారుణంగా హతమార్చారు. సనత్‌ నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని భరత్‌ నగర్‌లో అజార్‌ అనే వ్యక్తి కూడా దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

First Published:  20 Jun 2024 4:37 PM IST
Next Story