హైదరాబాద్ లో బిజినెస్ చేయాలంటే పోలీస్ లైసెన్స్ తప్పనిసరి
2014 వరకు ఈ పోలీస్ లైసెన్స్ విధానం అమలులో ఉన్నా.. కొత్త రాష్ట్రం ఏర్పాటయ్యాక దీన్ని రద్దు చేశారు. ఇప్పుడు మళ్లీ తిరిగి ప్రవేశ పెడుతున్నారు.
హైదరాబాద్ లో వ్యాపారులకు పోలీస్ లైసెన్స్ కూడా తప్పనిసరి చేశారు. ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని, అసలు ఎక్కడెక్కడ ఎవరెవరు ఏయే వ్యాపారాలు చేస్తున్నారనే విషయాలపై పోలీసులు పూర్తి స్థాయిలో దృష్టిపెట్టారు.
ఆయా వ్యాపార స్వరూప స్వభావాలను బట్టి అవసరమైతే పోలీసులు ముందుగానే ఆ ప్రదేశాలను సందర్శించి అనుమతులు మంజూరు చేస్తారు. 2014 వరకు ఈ పోలీస్ లైసెన్స్ విధానం అమలులో ఉన్నా.. కొత్త రాష్ట్రం ఏర్పాటయ్యాక దీన్ని రద్దు చేశారు. ఇప్పుడు మళ్లీ తిరిగి ప్రవేశ పెడుతున్నారు.
ఏదైనా వ్యాపారం చేయాలంటే ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరి. ఆహారానికి సంబంధించిన బిజినెస్ అయితే ఫుడ్ లైసెన్స్ ఉండాలి. వీటితోపాటు అగ్నిమాపక శాఖ నుంచి ఎన్ఓసీ తీసుకోవాలి. కొన్ని సార్లు నిబంధనలు పక్కనపెట్టి వీరికి అన్ని డిపార్ట్ మెంట్లు అనుమతులిస్తుంటాయి. అయితే పోలీసులు ఈ విషయంలో కఠినంగా నిబంధనలు అమలు చేస్తామంటున్నారు. పోలీస్ లైసెన్స్ కూడా తప్పనిసరి చేశారు.
స్టార్ హోటళ్లు, బార్ అండ్ రెస్టారెంట్లు, పబ్ లు, కాఫీ షాప్, టీ స్టాల్, బేకరీ, ఐస్ క్రీమ్ పార్లర్, స్వీట్ షాప్, జ్యూస్ సెంటర్, సినిమా థియేటర్స్, క్రాకర్స్ షాపులు, పెట్రోలియం ఉత్ప త్తులు అమ్మేవారు.. ఇలా అన్ని రకాల వ్యాపారాలకు పోలీసు లైసెన్స్ తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు.
లైసెన్స్ కోసం ఆన్ లైన్ (hyderabadpolice.gov.in)లో దరఖాస్తు తీసుకోవాల్సి ఉంటుంది. వ్యాపార స్థాయిని బట్టి వెయ్యి రూపాయలనుంచి 15వేల రూపాయల వరకు లైసెన్స్ ఫీజు వసూలు చేస్తారు. ప్రతి ఏడాది ఏప్రిల్ 1 నుంచి తర్వాతి ఏడాది మార్చి 31 తేదీ వరకు లైసెన్స్ గడువు ఉంటుంది. ఆ తర్వాత మళ్లీ రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది.