Telugu Global
Telangana

రాత్రివేళ మహిళలకు ఫ్రీ జర్నీ.. క్లారిటీ ఇచ్చిన పోలీసులు

హెల్ప్ లైన్ నెంబర్లు 1091, 78370 18555 ఫోన్ చేస్తే పోలీసులే స్వయంగా వచ్చి మ‌హిళ‌ల‌ను సుర‌క్షితంగా ఇంటి వద్దకు చేర్చుతార‌ని సోషల్ మీడియాలో కొద్దిరోజులుగా ప్రచారం మొదలైంది.

రాత్రివేళ మహిళలకు ఫ్రీ జర్నీ.. క్లారిటీ ఇచ్చిన పోలీసులు
X

రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య ఒంటరి మహిళలు తాము ఇంటికి చేరుకునేందుకు వాహనం దొరక్కపోతే పోలీసులకు ఫోన్ చేస్తే వారే ఉచితంగా తమ వాహనంలో ఇంటి వద్దకు చేర్చుతారంటూ సోషల్ మీడియాలో కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై తాజాగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజం కాదని.. ఎవరూ నమ్మవద్దని చెప్పారు.

ఇటీవల దేశవ్యాప్తంగా మహిళలపై అఘాయిత్యాలు పెరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాత్రి సమయంలో ఒంటరి మహిళలు ఎవరైనా ఇంటికి చేరుకునేందుకు వాహనం దొరక్కపోతే పోలీసు హెల్ప్ లైన్ నెంబర్లు 1091, 78370 18555 ఫోన్ చేస్తే పోలీసులే స్వయంగా వచ్చి మ‌హిళ‌ల‌ను సుర‌క్షితంగా ఇంటి వద్దకు చేర్చుతార‌ని సోషల్ మీడియాలో కొద్దిరోజులుగా ప్రచారం మొదలైంది.

ఇందుకు సంబంధించిన సమాచారం వాట్సాప్ గ్రూపుల్లో విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. కొందరు ఈ సమాచారాన్ని ఫేస్ బుక్ లో, వాట్సప్ స్టేటస్ లలో కూడా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై తాజాగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పందించారు.

ఒంటరి మహిళలను రాత్రివేళ వారి ఇంటి వద్ద పోలీసులు దింపుతున్నట్టు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని వారు స్పష్టం చేశారు. కొందరు ఈ విషయంలో కావాలనే ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పారు. మహిళలకు రాత్రివేళ ఉచిత రవాణా సౌకర్యం పేరిట తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చ‌రించారు.

First Published:  22 Aug 2024 7:48 PM IST
Next Story