Telugu Global
Telangana

హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం

ఓ దశలో రద్దీ దృష్ట్యా అదనపు బోగీల కోసం హైదరాబాద్ మెట్రో సంస్థ నిర్ణయం తీసుకుంది. ఆలోగా ఎన్నికలు రావడం, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణాలు అమలు చేయడంతో మెట్రోపై ఆ ప్రభావం పడింది.

హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం
X

ఆర్టీసీలో మహిళల ఉచిత ప్రయాణాలతో హైదరాబాద్ మెట్రో ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. నష్టాలతో మెట్రోని నడపలేమని నిర్వహణ సంస్థ తీర్మానించిందిని, త్వరలో ఆ బాధ్యత నుంచి తప్పుకోనుందని కూడా వార్తలొచ్చాయి. కానీ అవేవీ అధికారికం కావు. ఈ దశలో మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రో వేళలు పొడిగించింది. మరింత మందికి చేరువయ్యే ప్రయత్నాలు మొదలు పెట్టింది.

హైదరాబాద్‌ మెట్రో రైలు వేళల్లో అధికారులు మార్పు చేశారు. ఇప్పటి వరకు రాత్రి 11 గంటలకు చివరి సర్వీస్ ఉండగా.. ఇక నుంచి 11.45 గంటలకు చివరి రైలు ప్రయాణం ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. ప్రతి రోజూ ఉదయం 6 గంటలకు మెట్రో ప్రయాణాలు మొదలవుతాయి. అయితే సోమవారం మాత్రం ఉదయం 5.30 గంటల నుంచే మెట్రో మొదలవుతుంది. ఇటీవల రద్దీ పెరిగిన దృష్ట్యా ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో వేళల్లో మార్పులు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. పొడిగించిన వేళలు ఆల్రడీ అమలులోకి వచ్చేశాయి.

అదనపు బోగీలెప్పుడు..?

ఓ దశలో మెట్రో రద్దీ దృష్ట్యా అదనపు బోగీల కోసం సంస్థ నిర్ణయం తీసుకుంది. ఆలోగా ఎన్నికలు రావడం, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణాలు అమలు చేయడంతో మెట్రోపై ఆ ప్రభావం పడింది. మహిళలు లేక మెట్రోకి రాబడి కూడా తగ్గింది. దీంతో ఇప్పటికిప్పుడు అదనపు బోగీలు తీసుకు రావాల్సిన అవసరం లేకుండా పోయింది. అదే సమయంలో ప్రయాణికుల్ని ఆకర్షించేందుకు ప్రత్యామ్నాయాలపై మెట్రో యాజమాన్యం దృష్టి పెట్టింది.

First Published:  18 May 2024 6:48 AM IST
Next Story