Telugu Global
Telangana

హైదరాబాద్ మెట్రో సరికొత్త రికార్డు.. ఒక్క రోజులో ఎంతమంది రైలెక్కారంటే..?

ప్రధానంగా ఐటీ ఉద్యోగులు, ఐటీ కారిడార్ పరిధిలో ఉద్యోగాలు చేసేవారు మెట్రోను ఆశ్రయిస్తున్నారు. దీనికితోడు పండగ సీజన్ కూడా కావడం, ఎలక్షన్ హడావిడి ఉండటంతో మెట్రో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది.

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సరికొత్త రికార్డు.. ఒక్క రోజులో ఎంతమంది రైలెక్కారంటే..?
X

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సరికొత్త రికార్డు.. ఒక్క రోజులో ఎంతమంది రైలెక్కారంటే..?

హైదరాబాద్ మెట్రో మరోసారి వార్తల్లోకెక్కింది. రికార్డ్ స్థాయిలో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చింది. ఒక్కరోజే హైదరాబాద్ మెట్రో రైళ్లలో 5.47 లక్షలమంది ప్రయాణించారంటే మాటలు కాదు. 2017 నవంబర్ 29న ప్రారంభమైన హైదరాబాద్ మెట్రో రోజు రోజుకీ ప్రజాదరణ చూరగొంటోంది. కరోనా కాలంలో ప్రయాణాల సంఖ్య గణనీయంగా తగ్గినా.. ఆ తర్వాత బాగా పుంజుకుంది. ముఖ్యంగా సెలవు రోజుల్లో, సెలవుల తర్వాత వచ్చే వర్కింగ్ డేస్ లో ప్రయాణాల సంఖ్య మరింత పెరుగుతుంది. ఆఫీసు వేళల్లో మెట్రోలో జనం రద్దీగా ఉంటుండగా అమీర్‌ పేట్ జంక్షన్ ఉదయం, సాయంత్రం ప్రయాణికులతో కిక్కిరిసిపోతోంది. సోమవారం రోజున ఉప్పల్, ఎల్బీనగర్ స్టేషన్లు ప్రయాణికులతో నిండిపోతాయి.

రోజుకి 5 లక్షల పైనే..

ఇటీవల కాలంలో మెట్రోలో రోజుకి సగటున 5 లక్షల మంది ప్రయాణాలు చేస్తున్నారు. జూలై 3వ తేదీ సోమవారం రోజున మెట్రో రైలులో 5 లక్షల 10 వేల మంది ప్రయాణించగా అప్పటికి అది రికార్డుగా మారింది. తాజాగా మెట్రో మరింత రద్దీగా మారింది. 5.47 లక్షలమంది ప్రయాణికులను ఒకేరోజు గమ్యస్థానాలకు చేర్చింది. ఒకే రోజు మూడు కారిడార్లలో ఉన్న మెట్రో మార్గాల్లో 5.47 లక్షల మంది ప్రయాణించారు. మెట్రో సేవలు ప్రారంభమైన ఆరేళ్లలో ఒక్క రోజు ప్రయాణికుల సంఖ్య 5.5 లక్షలకు చేరువలో ఉండటం ఒక రికార్డని అధికారులు చెబుతున్నారు.

ప్రధానంగా ఐటీ ఉద్యోగులు, ఐటీ కారిడార్ పరిధిలో ఉద్యోగాలు చేసేవారు మెట్రోను ఆశ్రయిస్తున్నారు. దీనికితోడు పండగ సీజన్ కూడా కావడం, ఎలక్షన్ హడావిడి ఉండటంతో మెట్రో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. సోమవారం నుంచి శుక్రవారం వరకు మెట్రో కారిడార్ 3లో ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంటుందని అధికారులు తెలిపారు.

First Published:  6 Nov 2023 9:56 AM IST
Next Story