Telugu Global
Telangana

రద్దీకి చెక్.. మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్

ప్రస్తుతానికి అదనపు కోచ్ లను అద్దెకు తీసుకుని రైళ్లకు అమరుస్తారు. ఆగస్ట్ నాటికి అవి హైదరాబాద్ చేరుకుంటాయి. అదనపు కోచ్ లు అమరిస్తే రైళ్ల పొడవు పెరుగుతుంది. అయినా కూడా ప్లాట్ ఫామ్ ల వద్ద ఎలాంటి ఇబ్బంది ఉండదని చెబుతున్నారు అధికారులు.

రద్దీకి చెక్.. మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్
X

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త. మెట్రోలో రద్దీని తగ్గించేందుకు యాజమాన్యం బోగీల సంఖ్య పెంచేందుకు నిర్ణయం తీసుకుంది. ఆగస్ట్ నుంచి కొత్త బోగీలు మెట్రో రైళ్లకు జతచేరతాయి. ఇప్పుడున్న రైళ్లకు మూడు అదనపు కోచ్ లు అమరుస్తారు. దీంతో రద్దీని నియంత్రించవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మెట్రో రైళ్లకు మూడు కోచ్ లు ఉన్నాయి. వీటిలో ఒక కోచ్ లో సగభాగం మహిళలు, వృద్ధులకు కేటాయించారు. కొత్తగా మరో మూడు కోచ్ లు వస్తే.. ప్రతి రైలుకి మొత్తం 6 కోచ్ లు ఉన్నట్టవుతుంది. ఆగస్ట్ నుంచి కొత్త కోచ్ ల అమరిక మొదలవుతుంది.

పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్య..

రోజువారీ విధులకు హాజరయ్యేవారు, వివిధ పనులమీద హైదరాబాద్ వచ్చేవారు.. దాదాపుగా అందరూ మెట్రో ప్రయాణాలకు అలవాటుపడ్డారు. వ్యక్తిగత వాహనాలు ఉన్నవారు కూడా ట్రాఫిక్ జంఝాటం నుంచి తప్పించుకునేందుకు మెట్రోని ఆశ్రయిస్తున్నారు. ఇటీవల స్టూడెంట్ పాస్ లు ప్రవేశ పెట్టడంతో తాకిడి మరింత పెరిగింది. దీంతో మెట్రోలో రద్దీని నియంత్రించేందుకు అధికారులు. బోగీల సంఖ్య పెంచుతున్నారు.

గతం రోజూ మెట్రో సేవల్ని లక్షమంది వినియోగించుకుంటుండగా, ఇప్పుడు రోజువారీ ప్రయాణికుల సంఖ్య 5.10 లక్షలకు పెరిగింది. దీంతో రద్దీ నివారణ తప్పనిసరిగా మారింది. ఉదయం నుంచి రాత్రి వరకు ప్రయాణికుల సంఖ్య ఏమాత్రం తగ్గడంలేదు. కూర్చోడానికి కాదు కదా కనీసం నిలబడేందుకు కూడా స్థలం లేదనే ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో బోగీల సంఖ్య పెంచక తప్పడంలేదు.

ప్రస్తుతానికి అదనపు కోచ్ లను అద్దెకు తీసుకుని రైళ్లకు అమరుస్తారు. చెన్నై, నాగ్ పూర్ మెట్రో అధికారుతో ఈ విషయంలో చర్చలు జరుగుతున్నాయి. ఆగస్ట్ నాటికి అదనపు కోచ్ లు హైదరాబాద్ చేరుకుంటాయి. అదనపు కోచ్ లు అమరిస్తే రైళ్ల పొడవు పెరుగుతుంది. అయినా కూడా ప్లాట్ ఫామ్ ల వద్ద ఎలాంటి ఇబ్బంది ఉండదని చెబుతున్నారు అధికారులు.

First Published:  14 July 2023 12:32 PM IST
Next Story