Telugu Global
Telangana

విల్లా యజమానిని బెదిరించిన మంగలి కృష్ణ

జగన్‌కు సన్నిహితుడిగా పేరున్న మంగలి కృష్ణపై హైదరాబాద్‌ గచ్చిబౌలి పీఎస్‌లో కేసు నమోదు అయింది.

విల్లా యజమానిని బెదిరించిన మంగలి కృష్ణ
X

జగన్‌కు సన్నిహితుడిగా పేరున్న మంగలి కృష్ణపై హైదరాబాద్‌ గచ్చిబౌలి పీఎస్‌లో కేసు నమోదు అయింది. తాను ఉంటున్న విల్లాకు అద్దె ఎగ్గొట్టేందుకు ప్రయత్నించడంతో బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

కొండాపూర్‌లోని సైబర్‌ మెడోస్ గేటెడ్ కమ్యూనిటీలో శివప్రసాద్‌ రెడ్డి అనే వ్యాపారికి చెందిన విల్లాలో మంగలి కృష్ణ రెండేళ్లుగా అద్దెకుంటున్నారు. నెలకు 80వేల రూపాయల అద్దె ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. ఎనిమిది నెలలుగా అద్దె చెల్లించడం లేదు. ఇటీవల గట్టిగా నిలదీయడంతో అద్దె ఇచ్చేది లేదు... విల్లా ఖాళీ చేసేది లేదు.. ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకోపో.. అని బెదిరించారంటూ శివప్రసాదరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదైన విషయం తెలుసుకున్న మంగలి కృష్ణ... గచ్చిబౌలి పీఎస్‌కు వచ్చారు. తాను శివప్రసాదరెడ్డిని బెదిరించలేదని వివరణ ఇచ్చారు. విల్లాకు సంబంధించిన అద్దె డబ్బులు నెలనెల తన డ్రైవర్‌కు ఇచ్చి శివప్రసాదరెడ్డికి ఇవ్వాల్సిందిగా చెప్పానని .. కానీ డ్రైవర్ ఆ డబ్బును శివప్రసాదరెడ్డికి ఇవ్వలేదన్న విషయం తనకు ఇప్పుడే తెలిసిందన్నారు. వెంటనే అద్దె చెల్లిస్తానని హామీ ఇచ్చారు. పీఎస్‌లోనే బాధితుడు శివప్రసాదరెడ్డి, మంగలి కృష్ణ చర్చించుకుని రాజీ పడ్డారు.

First Published:  16 Sept 2022 6:15 AM IST
Next Story