బెస్ట్ సిటీగా హైదరాబాద్.. రేవంత్ సర్కార్‌కు KTR సూచన.!
జీవనవ్యయం, రాజకీయ పరిస్థితులు, స్థిరత్వం, హెల్త్‌కేర్, ఎడ్యూకేషన్, మౌలిక సదుపాయాల కల్పన, సోషియో-కల్చరల్ ఎన్విరాన్‌మెంట్ లాంటి ప్రమాణాలను మెర్సర్ పరిగణలోకి తీసుకుని ఈ ర్యాంకులను కేటాయించింది.
గ్లోబల్ సిటీగా ఎదుగుతున్న హైదరాబాద్.. మరోసారి ఇండియాలోనే బెస్ట్ సిటీగా నిలిచింది. బెంగళూరు, పుణే లాంటి ఐటీ నగరాలను దాటి ఆరోసారి ఈ ఘనతను దక్కించుకుంది. కోవిడ్‌కు ముందు 2015-19 మధ్య వరుసగా ఐదుసార్లు అగ్రస్థానంలో నిలిచింది హైదరాబాద్. అమెరికాకు చెందిన మెర్సర్-MERCER అనే కన్సల్టెన్సీ, ఆర్థిక సేవల సంస్థ.. అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన ప్రపంచ నగరాల జాబితాను తాజాగా విడుదల చేసింది.
మెర్సర్ జాబితాలో ఇండియా నుంచి హైదరాబాద్, బెంగళూరు, పుణే, కోల్‌కతా, ముంబై, చెన్నై, ఢిల్లీ చోటు దక్కించుకున్నాయి. మొత్తం జాబితాలో హైదరాబాద్ 153వ స్థానంలో నిలవగా.. పుణే 154, బెంగళూరు 156వ స్థానంలో నిలిచాయి. చెన్నై 161, ముంబై 164, కోల్‌కత్తా 170 స్థానాలు దక్కించుకోగా.. దేశ రాజధాని ఢిల్లీ 172 స్థానానికే పరిమితమైంది. జీవనవ్యయం, రాజకీయ పరిస్థితులు, స్థిరత్వం, హెల్త్‌కేర్, ఎడ్యూకేషన్, మౌలిక సదుపాయాల కల్పన, సోషియో-కల్చరల్ ఎన్విరాన్‌మెంట్ లాంటి ప్రమాణాలను మెర్సర్ పరిగణలోకి తీసుకుని ఈ ర్యాంకులను కేటాయించింది. జీవనవ్యయం విషయంలో దేశంలోని మిగతా నగరాలతో పోల్చితే హైదరాబాద్‌లో చాలా తక్కువ. వలసవచ్చే వారిలో చాలా మంది హైదరాబాద్‌వైపే మొగ్గు చూపుతున్నారు. కేవలం ఉపాధి అవకాశాలే కాదు.. ఇక్కడ ఉన్న సౌకర్యాలు కూడా వారిని హైదరాబాద్‌వైపు చూసేలా చేస్తున్నాయి.
Proud Hyderabadi ❤️
— KTR (@KTRBRS) December 13, 2023
We have ensured Hyderabad city topped the Mercer charts 6 times in last 9 years
Now it’s for the new Govt to take it to next level pic.twitter.com/s5F0qnvLeV
మెర్సర్ సంస్థ విడుదల చేసిన ర్యాంకింగ్స్‌పై కేటీఆర్ ట్విట్టర్‌లో స్పందించారు. హన్స్ ఇండియా, టైమ్స్ ఆఫ్ ఇండియా రాసిన కథనాలను తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు కేటీఆర్. హైదరాబాద్ మరోసారి ఇండియాలోనే బెస్ట్ సిటీగా నిలిచిందంటూ హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాదీలకు అభినందనలు తెలిపారు. గడిచిన 9 ఏళ్లలో హైదరాబాద్ ఆరోసారి ఈ ఘనతను సాధించిందన్నారు. దీనిని మరో స్థాయికి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపై ఉందన్నారు కేటీఆర్.