Telugu Global
Telangana

జీడీపీ పెరుగుదలలో ప్రపంచంలోనే నెంబర్-2 హైదరాబాద్

జీడీపీ వృద్ధి ఎక్కువగా ఉన్న నగరాల్లో హైదరాబాద్ చోటు దక్కించుకోవడమే కాదు, ఏకంగా రెండో స్థానం సంపాదించింది. ఇది కేవలం తెలంగాణ రాష్ట్రానికే కాదు, దేశానికి కూడా గర్వకారణం.

జీడీపీ పెరుగుదలలో ప్రపంచంలోనే నెంబర్-2 హైదరాబాద్
X

అభివృద్ధిలో, సంపద సృష్టిలో హైదరాబాద్ దూసుకెళ్తోంది అనే మాట విశ్వవ్యాప్తంగా మారింది. జీడీపీలో దేశంతో తెలంగాణ రాష్ట్రం పోటీపడి ముందడుగు వేసింది. ఇప్పుడు హైదరాబాద్ ప్రపంచ నగరాలతో పోటీ పడి మరీ మెరుగైన స్థానం సంపాదించింది. జీడీపీ వృద్ధి ఎక్కువగా ఉన్న నగరాల్లో హైదరాబాద్ చోటు దక్కించుకోవడమే కాదు, ఏకంగా రెండో స్థానం సంపాదించింది. ఇది కేవలం తెలంగాణ రాష్ట్రానికే కాదు, దేశానికి కూడా గర్వకారణం.

జీడీపీ వృద్ధిలో 2021లో వియత్నాంలోని చెంగ్డు మొదటి స్థానంలో ఉండగా, ఈ ఏడాది చైనాలోని హో చి మిన్ నగరం ఫస్ట్ ప్లేస్ ఆక్రమించింది. హైదరాబాద్ సెకండ్ ప్లేస్ కి చేరుకుంది. కరోనా తర్వాత సహజంగా లెక్కలన్నీ తారుమారవుతున్నాయి. అందివచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవడంలో హైదరాబాద్ తన సత్తా చాటింది. అత్యథిక జీడీపీ వృద్ధి రేటుతో ప్రపంచంలోనే రెండో స్థానం, దేశంలోనే మొదటి స్థానం సంపాదించింది.

గతేడాది రెండో స్థానంలో ఉన్న బెంగళూరు ఈ ఏడాది మూడో స్థానానికి పడిపోగా, ఢిల్లీ ఎనిమదిో స్థానం నుంచి నాలుగో స్థానానికి ఎగబాకింది. ఈ ఏడాది లిస్ట్ లో హైదరాబాద్ తో పాటు బెంగళూరు, ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్ కతా కూడా స్థానం సంపాదించాయి. అయితే ఈ నగరాలన్నిటినీ వెనక్కు నెట్టి హైదరాబాద్ దేశంలోనే మొదటి స్థానం సంపాదించడం విశేషం.



గుజరాత్, యూపీ ఎక్కడ..?

ఈ ర్యాంకుల జాబితాలో మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ కి స్థానం లేదు, డబుల్ ఇంజిన్ సర్కారు అంటూ డబ్బా కొట్టుకుంటున్న ఉత్తర ప్రదేశ్ కి కూడా చోటు లేదు. ఆ రెండు రాష్ట్రాలు కేవలం ప్రచార ఆర్భాటంలోనే ముందుంటాయని, ప్రపంచ స్థాయి నివేదికల్లో మాత్రం వాటి ప్లేస్ వెనకేనని చెబుతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆర్థిక విధానాలు, కంపెనీలకు ఇస్తున్న ప్రోత్సాహకాలు, మానవ వనరుల వినియోగం, వ్యాపార అభివృద్ధికి ఉన్న అవకాశం.. ఇలాంటివన్నీ కలిపి హైదరాబాద్ ని ప్రపంచంలోనే నెంబర్ -2 స్థానంలో నిలిపాయి.

First Published:  14 Sept 2022 1:07 PM IST
Next Story