Telugu Global
Telangana

సెప్టెంబర్ నాటికి ఆ ఘనత హైదరాబాద్ సొంతం

పెరుగుతున్న జనాభా హైదరాబాద్ సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు పరీక్షిస్తోంది. నగరంపై ఒత్తిడి పెరుగుతున్నా దాన్ని తట్టుకునేలా ప్రభుత్వం ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసింది.

సెప్టెంబర్ నాటికి ఆ ఘనత హైదరాబాద్ సొంతం
X

సెప్టెంబర్ నాటికి ఆ ఘనత హైదరాబాద్ సొంతం

ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి భారత్ లోనే అరుదైన ఘనత సొంతం చేసుకోబోతోంది హైదరాబాద్. మురుగునీటిని 100 శాతం శుద్ధి చేసే నగరాల జాబితాలో హైదరాబాద్ కి చోటు దక్కుతుంది. భారత్ లో ఇలా పూర్తి స్థాయిలో మురుగునీటి శుద్ధి ప్లాంట్లు ఏర్పాటు చేసుకుంటున్న ఏకైక నగరం హైదరాబాద్ మాత్రమే కావడం విశేషం. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి మురుగునీటి శుద్ధి ప్లాంట్లన్నీ అందుబాటులోకి వస్తాయి.



కేటీఆర్ విజన్..

భారత్ లోని నగరాల్లో మురుగునీటి సమస్య చాలా ప్రధానమైనది. ఆ నీటిని బయట ప్రాంతాలకు పంపించడం కంటే.. నగరంలోనే శుద్ధి చేసి పునర్వినియోగించడం, లేదా నీటి వనరులలోకి పంపించడం ప్రత్యామ్నాయ మార్గం. దీనికోసం తెలంగాణ ప్రభుత్వం ఓ ప్రణాళికతో ముందడుగు వేసింది. 3899 కోట్ల రూపాయల వ్యయంతో మురుగునీటిని శుద్ధి చేసే ప్లాంట్లు(STP) ఏర్పాటు చేస్తోంది. కోకాపేటలో 15MLD సామర్థ్యంతో తొలి STP నేటి నుంచి అందుబాటులోకి వస్తోంది. మిగిలిన ప్రాంతాల్లో నెలకొల్పే STPలు మరికొద్ది నెలల్లో పని మొదలు పెడతాయంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.


సుందర నగరంగా హైదరాబాద్..

పెరుగుతున్న జనాభా హైదరాబాద్ సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు పరీక్షిస్తోంది. నగరంపై ఒత్తిడి పెరుగుతున్నా దాన్ని తట్టుకునేలా ప్రభుత్వం ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసింది. తాగునీటికి 2050 వరకు కరువు లేకుండా ఇప్పటినుంచే అందుబాటులోకి తెచ్చేసింది. ఇక మురుగునీటి శుద్ధికోసం ప్లాంట్లు ఏర్పాటు చేస్తోంది. భవిష్యత్ లో పెరిగే అవసరాలకు ముందుగానే సిద్ధమవుతోంది ప్రభుత్వం.

First Published:  1 July 2023 11:20 AM IST
Next Story