హైదరాబాద్ లో గణేష్ ఉత్సవాలకు భారీ బందోబస్తు..
సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం మండపాల వద్ద రాత్రి 10గంటల వరకు మాత్రమే స్పీకర్లు వినియోగించాలని సూచించారు సీపీ చౌహాన్. మండపాల్లో డీజే ఏర్పాటుకు అనుమతి లేదని స్పష్టం చేశారు. మండపాల్లో వాలంటీర్లను ఏర్పాటు చేసుకోవాలని నిర్వాహకులకు సూచించారు.
హైదరాబాద్ లో గణేష్ ఉత్సవాలకు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్. నేరేడ్ మెట్ లోని కమిషనర్ కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. గణేష్ నవరాత్రులు, నిమజ్జనం కార్యక్రమాలు ప్రణాళిక ప్రకారం జరగాలని, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చూడాలని అధికారులకు సూచించారు. విగ్రహాల ఏర్పాటుకి ముందే నిర్వాహకులతో, ఇన్ స్పెక్టర్లు సమావేశమవ్వాలన్నారు. శాంతిభద్రతల సమస్యలు రానీయొద్దని, అందరూ సమష్టిగా కృషి చేయాలన్నారు.
Elaborate #Security_Arrangements for #GaneshFestival: #CP_Rachakonda
— Rachakonda Police (@RachakondaCop) September 6, 2023
Sri.#DS_Chauhan_IPS holds a review meeting with all #DCPs, #ADCPs, #ACPs & #SHOs of all #PoliceStations today at the #CP_office, Neredmet regarding the security arrangements for the forthcoming #Ganesh_Festival. pic.twitter.com/flrJNkMGzq
డీజేలు వద్దు..
సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం మండపాల వద్ద రాత్రి 10గంటల వరకు మాత్రమే స్పీకర్లు వినియోగించాలని సూచించారు సీపీ చౌహాన్. మండపాల్లో డీజే ఏర్పాటుకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఆ విషయం మండపం నిర్వాహకులు, కమిటీలకు అధికారులు వివరించి చెప్పాలన్నారు. మండపాల్లో వాలంటీర్లను ఏర్పాటు చేసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. భక్తుల రద్దీ లేకుండా మండపాలలో క్యూలైన్లు ఏర్పాటు చేయాలన్నారు. షార్ట్ సర్క్యూట్ జరగకుండా నాణ్యమైన విద్యుత్ వైర్లను ఉపయోగించాలన్నారు. నిర్వాహకులు, కమిటీ సభ్యుల ఫోన్ నెంబర్లతో కూడిన ఫ్లెక్సీలను మండపంలో ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి మండపం వద్ద పాయింట్ బుక్ ఏర్పాటు చేయాలని చెప్పారు.
డయల్ 100 కు వచ్చే కాల్స్ ను ప్రత్యేక శ్రద్ధతో పరిగణించాలని పోలీస్ అధికారులకు సూచించారు కమిషనర్. సీసీ టీవీలపై దృష్టి సారించాలన్నారు. విజిబుల్ పోలీసింగ్ కు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. మండపాల వద్ద సమస్యలు లేకుండా, ఘర్షణ వాతావరణం లేకుండా చూడాలన్నారు. అవసరమైన ప్రదేశాల్లో పికెట్ ఏర్పాటు చేయాలన్నారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు పోస్టులపై నిఘా ఉంచామని.. వదంతులు ప్రచారం చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇక నిమజ్జనోత్సవాలకు కూడా అవసరమైన పోలీస్ బందోబస్తుపై ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు కమిషనర్. నిమజ్జనం సందర్భంగా చెరువులు, ఇతర నిమజ్జన నీటి కుంటల వద్ద వీధి దీపాలు, ఫ్లడ్ లైట్లు, అవసరమైన మేర క్రేన్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. చెరువు కట్టల వద్ద టెంట్లు, విద్యుత్ లైట్లు, బారికేడ్లు నిర్మించాలని, మంచి నీటి సౌకర్యం, మొబైల్ టాయిలెట్లు, వైద్య సదుపాయాలను ఏర్పాటు చేయాలన్నారు.