హైదరాబాద్ సీపీ షాకింగ్ నిర్ణయం.. ఆ పీఎస్‌లోని స్టాఫ్ మొత్తం ట్రాన్స్‌ఫర్
ఒక స్టేషన్‌లోని మొత్తం సిబ్బందిని బదిలీ చేయడం ఇదే తొలిసారి. ఇటీవల పంజాగుట్ట పీఎస్ పరిధిలో చోటు చేసుకున్న పరిణామాలతో హైదరాబాద్ సీపీ శ్రీనివాస్‌రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లోని సిబ్బంది మొత్తాన్ని ట్రాన్స్‌ఫర్ చేశారు. ఇన్‌స్పెక్టర్ నుంచి హోంగార్డుల వరకు అందరినీ ఆర్మ్‌డ్ రిజర్వ్‌కు అటాచ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 85 మందిని ఒకేసారి బదిలీ చేశారు.
ఒక స్టేషన్‌లోని మొత్తం సిబ్బందిని బదిలీ చేయడం ఇదే తొలిసారి. ఇటీవల పంజాగుట్ట పీఎస్ పరిధిలో చోటు చేసుకున్న పరిణామాలతో హైదరాబాద్ సీపీ శ్రీనివాస్‌రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు కొత్తగా 82 మంది సిబ్బందిని నియమించారు. సిటీలోని వివిధ పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బందిని పంజాగుట్టకు బదిలీ చేశారు.
హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సంచలన నిర్ణయం
— Telugu Scribe (@TeluguScribe) January 31, 2024
పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లోని సిబ్బంది మొత్తాన్ని మార్చివేసిన సీపీ.
ఇన్‌స్పెక్టర్ దగ్గర నుంచి హోంగార్డుల వరకు అందర్నీ ఏ ఆర్ కు అటాచ్ చేసిన సిపి.
86 మంది సిబ్బందిని ఒకేసారి బదిలీ చేయడం ఇదే మొదటిసారి
బోధన్ మాజీ ఎమ్మెల్యే… pic.twitter.com/ISGLh6yHB0
బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడి వ్యవహారంలో పంజాగుట్ట స్టేషన్‌లోని పోలీసులు వ్యవహరించిన తీరు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీంతో పాటు కీలక విషయాలు లీక్ అవడంపై సీపీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.