Telugu Global
Telangana

బిజినెస్ కేపిటల్ ఆఫ్ ఇండియాగా హైదరాబాద్

హైదరాబాద్‌ లో మొత్తం 72 లక్షల చదరపు అడుగుల షాపింగ్‌ ఏరియా అందుబాటులో ఉండగా అందులో 52 శాతం వాటా.. అంటే 39 లక్షల చదరపు అడుగులు GLAనే కావటం గమనార్హం. గ్రేడ్-ఎలో ఉన్న టాప్ 8 సిటీస్ లో హైదరాబాద్ అగ్ర స్థానంలో నిలిచింది.

బిజినెస్ కేపిటల్ ఆఫ్ ఇండియాగా హైదరాబాద్
X

సాఫ్ట్ వేర్ రంగంలో ఇప్పటికే బెంగళూరుని హైదరాబాద్ వెనక్కి నెట్టింది. ఉద్యోగాలు, ఐటీ ఉత్పత్తుల ఎగుమతుల్లో బెంగళూరుని దాటేసింది. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా హైదరాబాద్ దేశంలోనే టాప్ ప్లేస్ లో ఉంది. ఇప్పుడు కొత్తగా మరో ఘనత సాధించి బిజినెస్ కేపిటల్ ఆఫ్ ఇండియాగా మారే అవకాశాన్ని సొంతం చేసుకుంది. వ్యాపార అవకాశాలు అత్యథికంగా ఉన్న నగరంగా దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలిచింది హైదరాబాద్.

గ్రాస్ లీజబుల్ ఏరియా లిస్ట్ లో నెంబర్-1

షాపింగ్ మాల్స్‌లో లీజుకి ఇచ్చే స్థలాల విస్తీర్ణం(గ్రాస్ లీజబుల్ ఏరియా)GLA ప్రాతిపదికగా తీసుకొని నెట్ ఫ్రాంక్ ఇండియా అనే సంస్థ రూపొందించిన జాబితాలో హైదరాబాద్ నెంబర్-1 స్థానంలో ఉంది. 5 లక్షలకు పైగా చదరపు అడుగుల GLA కలిగిన షాపింగ్‌ మాల్స్‌, అవి ఉన్న నగరాలను గ్రేడ్‌-ఎ లో చేర్చారు. లక్ష నుంచి లక్షన్నర లోపు GLA గల సిటీలను గ్రేడ్‌-బిలో, లక్ష కన్నా తక్కువ GLA ఉన్న వాటిని గ్రేడ్‌-సిలో చేర్చి ఈ జాబితా రూపొందించారు. గ్రేడ్-ఎలో ఉన్న టాప్ 8 సిటీస్ లో హైదరాబాద్ అగ్ర స్థానంలో నిలిచింది.

హైదరాబాద్‌ లో మొత్తం 72 లక్షల చదరపు అడుగుల షాపింగ్‌ ఏరియా అందుబాటులో ఉండగా అందులో 52 శాతం వాటా.. అంటే 39 లక్షల చదరపు అడుగులు GLAనే కావటం గమనార్హం. ఈ ఏడాదిలో మొదటి ఆరు నెలలకు సంబంధించిన ఈ రిటైల్‌ రిపోర్టును నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా అనే సంస్థ తయారు చేసింది. థింక్‌ ఇండియా - థింక్‌ రిటైల్‌ - రీఇన్వెంటింగ్‌ ఇండియన్‌ షాపింగ్‌ మాల్స్‌ అనే పేరుతో రూపొందిన ఈ జాబితాలో హైదరాబాద్ తర్వాతి స్థానాల్లో కోల్ కతా, ముంబై, బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్, పుణె ఉన్నాయి. ఈ నివేదిక ప్రకారం వ్యాపారానికి హైదరాబాద్ ఎంతో అనువైన, అవకాశాలు ఉన్న ప్రదేశంగా గుర్తింపు తెచ్చుకుంది. వాణిజ్య రాజధానిగా పేరున్న ముంబైని సైతం హైదరాబాద్ వెనక్కి నెట్టిందంటే.. భవిష్యత్తులో హైదరాబాద్ బిజినెస్ కేపిటల్ ఆఫ్ ఇండియాగా మారే అవకాశం లేకపోలేదు.

First Published:  14 Sept 2022 4:24 PM IST
Next Story