తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీ.. అంజనీకుమార్‌కు షాక్
హైదరాబాద్ మాజీ సీపీ సి.వి.ఆనంద్‌ను ఏసీబీ డీజీగా బదిలీ చేసింది. సీఐడీ చీఫ్‌గా ఉన్న మహేష్ భగవత్‌ను రైల్వే రోడ్ అడిషనల్ డీజీగా బాధ్యతలు అప్పగించింది.
తెలంగాణలో మరోసారి భారీగా ఐపీఎస్‌ల బదిలీలు చేపట్టింది ప్రభుత్వం. మొత్తం 20 మంది అధికారులను బదిలీ చేసింది. ఎన్నికల టైమ్‌లో అంజనీకుమార్‌ను తొలగించి డీజీపీగా రవిగుప్తాను ఎన్నికల సంఘం నియమించిన విషయం తెలిసిందే. అయితే రవిగుప్తాను డీజీపీగా కొనసాగిస్తూ పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. అంజనీకుమార్‌కు రోడ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్‌గా బదిలీ చేసింది. ఇక ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఇక హైదరాబాద్ మాజీ సీపీ సి.వి.ఆనంద్‌ను ఏసీబీ డీజీగా బదిలీ చేసింది. సీఐడీ చీఫ్‌గా ఉన్న మహేష్ భగవత్‌ను రైల్వే రోడ్ అడిషనల్ డీజీగా బాధ్యతలు అప్పగించింది.
20 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం
--- డీజీపీగా రవి గుప్తా కొనసాగింపు
--- అంజనీకుమార్‌ను ఎన్నికల సంఘం సస్పెండ్ చేయడంతో..
--- రవిగుప్తాను తాత్కాలిక డీజీపీగా నియమించిన ఈసీ
--- రవిగుప్తాను డీజీపీగా కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
--- మాజీ డీజీపీ అంజనీకుమార్ రోడ్డు సెఫ్టీ అథారిటీ ఛైర్మన్‌గా బదిలీ
--- అంజనీకుమార్‌కు ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు
--- విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా రాజీవ్ పఠాన్
--- ఏసీబీ డీజీగా సీనియర్ ఐపీఎస్ సీవీ ఆనంద్
--- తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా అభిలాష్ బిస్త్
--- జైళ్ళ శాఖ డీజీగా డాక్టర్ సౌమ్య మిశ్రా
--- సీఐడీ అదనపు డీజీగా శిఖాగోయల్
--- శిఖాగోయల్‌కు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు
--- రైల్వేస్, రోడ్డు సెఫ్టీ అడిషనల్ డీజీగా మహేష్ భగవత్
--- తెలంగాణ ఎస్పీఎఫ్ డీజీగా డాక్టర్ అనీల్ కుమార్
--- తెలంగాణ హోంగార్డ్స్ ఐజీగా స్టీఫెన్ రవీంద్ర
--- హైదరాబాద్ మల్టీ జోన్-2 ఐజీగా డాక్టర్ తరుణ్ జోషి
--- ఎక్సైజ్ శాఖ డైరెక్టర్‌గా విబి కమలాసన్ రెడ్డికి పూర్తి అదనపు బాధ్యతలు
--- ఎసీబీ డైరెక్టర్‌గా ఎఆర్ శ్రీనివాస్
--- తెలంగాణ పర్సనల్ ఐజీగా చంద్రశేఖర్ రెడ్డి
--- స్టేట్ పోలిస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా రమేష్‌కు పూర్తి అదనపు బాధ్యతలు
--- సీఐడీ డీఐజీగా కె రమేష్ నాయుడు
--- హెడ్‌క్వార్టర్స్ జాయింట్ కమిషనర్‌గా వి సత్యనారాయణ
--- డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాలని ఎం శ్రీనివాసులకు ఆదేశాలు
--- ఎస్‌ఐబి ఇంటిలిజెన్స్ డీఐజీగా బి సుమతి
--- హైదరాబాద్ సిటీ సెంట్రల్ జోన్ డిప్యూటీ కమిషనర్‌గా శరత్ చంద్ర పవార్