Telugu Global
Telangana

మహారాష్ట్రలో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదుకి ఊహించని స్పందన..

ప్రస్తుతం అక్కడ బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు పండగలా సాగుతోంది. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అంటూ మహారాష్ట్ర పల్లెలు నినదిస్తున్నాయి.

మహారాష్ట్రలో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదుకి ఊహించని స్పందన..
X

మహారాష్ట్రలో బీఆర్ఎస్ జెండాలు రెపరెపలాడుతున్నాయి. ఊరూవాడా సభ్యత్వ నమోదు కార్యక్రమం జోరందుకుంది. 288 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకేసారి సభ్యత్వ నమోదు ప్రారంభించారు. గ్రామ పార్టీ నిర్మాణంతోపాటు, 9 అనుబంధ కమిటీల నిర్మాణం కూడా పోటాపోటీగా సాగుతుంది. తెలంగాణ మోడల్ కి జై అంటున్న వారంతా గులాబి కండువా కప్పుకోడానికి ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా రైతులు, మహిళలు బీఆర్ఎస్ వైపు ఆకర్షితులవుతున్నట్టు స్థానిక నాయకులు చెబుతున్నారు.

ఇటీవల నాందేడ్ లో బీఆర్ఎస్ శిక్షణ కార్యక్రమం ముగిశాక జూన్ నుంచి సభ్యత్వ నమోదు పగడ్బందీగా చేపట్టాలని నియోజకవర్గాల నాయకులు, ఇన్ చార్జ్ లకు బీఆర్ఎస్ అధినాయకత్వం దిశానిర్దేశం చేసింది. ప్రస్తుతం అక్కడ బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు పండగలా సాగుతోంది. పార్టీ సభ్యత్వ నమోదుకోసం గ్రామాల్లోకి వెళ్లే పార్టీ బృందాలకు స్థానికులు స్వాగతం పలికి మరీ సభ్యత్వాలు తీసుకుంటున్నారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అంటూ మహారాష్ట్ర పల్లెలు నినదిస్తున్నాయి.

గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల నుంచి బీఆర్‌ఎస్‌ కు మంచి స్పందన వస్తుందని అంటున్నారు స్థానిక నేతలు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, వాటి ఫలితాలను మహారాష్ట్ర ప్రజలు ఇప్పటికే తెలుసుకున్నారు, మరోసారి వాటి గురించి స్థానిక నాయకులు వివరిస్తున్నారు. మహారాష్ట్రలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడితే ఇలాంటి ఫలితాలే వస్తాయని చెబుతున్నారు. సభ్యత్వ నమోదుతో సరిపెట్టబోమని, ప్రతి ఒక్కరినీ క్రియాశీల కార్యకర్తలుగా మారుస్తామని అంటున్నారు బీఆర్ఎస్ మహారాష్ట్ర విభాగం నాయకులు.

First Published:  4 Jun 2023 8:10 AM IST
Next Story