ప్రజావాణిలో భారీగా అర్జీలు
ఇవాళ జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో 627 దరఖాస్తులు వచ్చాయిని స్టేట్ నోడల్ అధికారి దివ్య తెలిపారు.
హైదరాబాద్ బేగంపేటలోని మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి తమ అర్జీలను అందజేశారు. ప్రజావాణి కార్యక్రమంలో 627 దరఖాస్తులు అందాయి. రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి దివ్య ప్రజల వినతులను స్వీకరించారు. అర్జీదారుల సమస్యలు ఓపికగా విని సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి దరఖాస్తులపై చిన్నారెడ్డి ఎండార్స్ చేసి సమస్యల తక్షణ పరిష్కారానికి కృషి చేశారు. ప్రతి ప్రజావాణి కార్యక్రమంలో ఇళ్ల కోసం దరఖాస్తులు అందుతున్నాయి.
ఈసారి కూడా 185 దరఖాస్తులు ఇళ్ల కోసం వచ్చాయి. సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించి 108 దరఖాస్తులు, రెవెన్యూ శాఖకు 60, విద్యుత్ శాఖ 57, ప్రవాసి ఎన్. ఆర్. ఐ. విభాగానికి సంబంధించి 4 , ఇతర శాఖల 213 దరఖాస్తులు ప్రజావాణిలో అందాయి. ఈ దరఖాస్తులు అన్నింటినీ ఆన్ లైన్ ద్వారా సీఎం ప్రజావాణి పోర్టల్ నుంచి సంబంధిత శాఖల అధికారులకు పంపారు. వివిధ శాఖలకు చెందిన నోడల్ అధికారులు చిన్నారెడ్డి, దివ్యలకు సహకారాన్ని అందించారు.